24 గంటలు చూస్తాం..కేంద్రం స్పందించకపోతే.. అంతు చూస్తాం కవిత వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీలో ప్రజాప్రతినిధుల దీక్ష విజయవంతమయిందని.. ఇకనైనా బిజెపి కళ్ళు తెరవాలని ఫైర్ అయ్యారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నీతిని అవలంభిస్తోంది. రైతుల నడ్డి విడిచేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఢిల్లీలో తాము ధర్నా చేస్తుంటే, హైదరాబాద్ లో బిజెపి దొంగ దీక్ష చేస్తుందన్నారు.
గతంలో వడ్లు తక్కువ వేయాలని మేం కోరామని చెప్పారు. బిజెపి నేతలు ప్రతి గింజ కొంటామని చెప్పారన్నారు కవిత. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పెట్టిన గడువు అని.. 24 గంటలు, అప్పటి వరకు వేచి చూద్దామని పేర్కొన్నారు. ఆ తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా, ప్రభుత్వాలు నిర్ణయాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఇది రాజ్యాంగo కాదని.. తెలంగాణ లో పండిన అన్ని వడ్లు కొనాలని డిమాండ్ చేశారు కవిత. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు టిఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగబోదని పేర్కొన్నారు.