గరుడ ముక్కు మొక్క గురించి విన్నారా ?ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

-

భగవంతుడు ప్రసాదించిన ప్రకృతి ఒడిలో మనకు ఎన్నో రకాలైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉన్నాయి. ఇలాంటి మొక్కలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో దోహదపడతాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మొక్కల్లో గరుడ ముక్కు మొక్క కూడా ఒకటి చెప్పుకోవచ్చు. ఈ గరుడ ముక్కు కాయలను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. ఈ చెట్టును గరుడ ముక్కు చెట్టు లేదా తేలు కొండి చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ మొక్కను చాలామంది చూసే ఉంటారు.ఈ చెట్టు మార్టినేసియా కుటుంబానికి చెందినది. ఈ గరుడ ముక్కు చెట్లు మనకి ఎక్కువగా అడవులలోనూ, బీడు భూములలోను కనిపిస్తుంటాయి.

Garuda Mukku: ఏజెన్సీ ప్రాంతాల్లో దొరికే ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు..  కనిపిస్తే వదలకండి | Martynia Annua plant (garuda mukku plant) uses and  amazing health benefits | TV9 Telugu

ఈ చెట్టు మనకి చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. ఈ చెట్టు ఆకులు చాలా మృదువుగా ఉంటాయి. అలానే ఈ చెట్టు పువ్వులు తెలుపు మరియు ఎరుపు రంగులో కలిసి కనిపిస్తుంటాయి.మరీ ఈ గరుడ మొక్క చాలా అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది వాటి గురించి ఇప్పుడు చూద్దాం..ఈ మొక్కను పూర్వం నుంచి కూడా భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు. అలానే ఈ మొక్క యొక్క కాయలను పూర్వం నుంచి కూడా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నారు.

ముఖ్యంగా క్షయ వ్యాధి నివారణకు ఈ తేలుకొండి కాయలు చాలా బాగా పనిచేస్తాయి.గొంతు నొప్పి ఉన్నవారు ఈ మొక్క యొక్క ఆకుల నుంచి రసాన్ని తీసి ఈ రసాన్ని నోట్లో వేసుకుని పలమార్లు పుక్కిలిస్తూ ఉన్నట్లయితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పి ఉన్నవారు ఈ చెట్టు యొక్క వేరును సేకరించి దాన్ని నీడలో ఆరబెట్టి దంచి పొడి చేసుకుని ఆ పొడిని ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ వేసి రాత్రి అంతా అలానే ఉంచి ఉదయాన్నే ప్రతిరోజు త్రాగడం వలన ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వీటితోపాటు మరెన్నో వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news