ప్ర‌తిరోజు పాలు తాగుతున్నారా… ఇవి తెలుసుకోండి..

-

అనేక పోష‌కాలు ఉన్న పాలు గురించి చాలా మందికి చాలా విష‌యాలు తెలియ‌వు. అయితే ఎక్కువ శాతం మంది పాలు తాగ‌డానికే ఇష్ట‌ప‌డ‌రు. రోజూ పాలు తాగడం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయని మాత్రమే మనకు తెలిసి విష‌యం.  పాలలో కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పాల‌ను వేలాది ఏళ్లుగా ఆహారంలో భాగం చేసుకున్నాం. నిజానికి పాలు తాగడం వల్ల వివిధ రకాల వ్యాధులు కూడా దూరమవుతాయి. మ‌రియు ఆరోగ్యాన్ని ర‌క్షించే స‌హ‌జ‌ సిద్ధమైన పరిపూర్ణ పౌష్టికాహారం.


కొంద‌రు పాలు తాగ‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతార‌ని పాల‌కు దూరంగా ఉంటారు. కానీ.. పాల‌తో బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌న్న విష‌యం చాలా మంద‌కి తెలియ‌దు.  పాలు తాగడం వల్ల కాల్షియం, విటమిన్ డి, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇలా శ‌రీరానికి కావాల్సిన ఎన్నో పోష‌కాలు అందుతాయి. అలాగే ఎన్నో ఉప‌యోగాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

– ప్ర‌తి ఒక్క‌రూ చిన్నప్పటి నుంచీ పాలు తాగే అలవాటు ఉన్న వారిలో రొమ్ము క్యాన్సర్‌ కలిగే అవకాశాలు దాదాపు తక్కువ‌. పాలలో ఉండే కాల్షియం సహజ రూపంలో ఉండే కొవ్వు  క్యాన్సర్‌ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడుతుంది.

– మ‌న పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి, బరువు అదుపులో ఉంచుకోవడానికి పాలు ఉపయోగపడతాయి. పాలలో ఉండే కాల్షియం కొవ్వు తగ్గడానికి ఉప‌క‌రిస్తుంది.

– ప్ర‌తి రోజు పాలు తాగటం వల్ల కళ్ళు తేటగా ప్రకాశవంతంగా అవుతాయి. శరీరానికి ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది. శరీరంలోని అవయవాలన్నిటిలోకి సరిపడా శక్తి చేరుకుంటుంది.

– వేడిపాల తాగ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గాతాయి. అలాగే మలబద్ధకంతో బాధపడేవారు పాలని ప్ర‌తి రోజు తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

–  ప్ర‌తి రోజూ తక్కువ ఫ్యాట్‌ కలిగిన పాలను తాగితే, టైప్‌-2 మధుమేహ వ్యాధికి గురయ్యే అవకాశాలు చాలా వరకు త‌గ్గ‌తాయి.

– పాల‌లో కాల్షియం, ఫాస్పరస్‌, విటమిన్లు వంటి అనేక పోషక విలువలు ఉంటాయి. ఇవి కండరాలు, దంతాలు, ఎముకలు పటిష్టంగా ఉంచడంలో పాలు కీలక పాత్ర పోషిస్తాయి.

– నిద్రలేమితో బాధపడే వాళ్ళకు పాలు బాగా స‌హాయ‌ప‌డ‌తాయి. ప్ర‌తి రోజు ప‌డుకునే ముందు ఓ గ్లాసుడు పాల‌లో తేనె క‌లిపి తాగితే మంచి ఫ‌లితం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news