చెర్రీస్ వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా…?

Join Our Community
follow manalokam on social media

చెర్రీస్ తినడానికి చాలా రుచిగా ఉంటాయి. జ్యూసీ జ్యూసీగా ఉండే చెర్రీస్ ని స్నాక్స్ లాగ కూడా తినవచ్చు. పిల్లలు కూడా వీటిని తినడానికి ఎక్కువగా ఇష్ట పడుతుంటారు. ఐస్ క్రీమ్స్, జ్యూసులు వంటి వాటి పై కూడా వేసుకుని వీటిని తినొచ్చు. అయితే చెర్రీస్ వల్ల కలిగే లాభాలు గురించి ఇప్పుడే చూడండి. దీని వల్ల కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి.  వివరాల లోకి వెళితే…. చెర్రీస్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి సహాయ పడతాయి.

తల నొప్పి కూడా తగ్గించడానికి ఇవి సహాయ పడతాయి బ్లడ్ ప్రెషర్ ని అదుపులో ఉంచడానికి కూడా చెర్రీస్ బాగా సహకరిస్తాయి. ఒక కప్పు చెర్రీస్ తీసుకుంటే 100 క్యాలరీ మీకు అందుతాయి. అలానే బరువు తగ్గడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. అంతే కాదండీ మీ పిహెచ్ బ్యాలెన్స్ ని కూడా బాగా మెయింటైన్ చేయవచ్చు. ఇవి ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా కూడా పని చేస్తాయి. స్ట్రాబెర్రీలలో, బ్లాక్ బెర్రీలలో ఉండే మెలటోనిన్ ఇందులో ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది నిద్రలేమి సమస్యను కూడా తగ్గిస్తుంది.

కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఇవి బాగా పనిచేస్తాయి. డార్క్ స్పాట్స్ ముఖం పై ఉంటే చెర్రీ జ్యూస్ ను అప్లై చేయండి. దీనివల్ల అవి తగ్గిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది. చెర్రీస్ తినడం వల్ల అరుగుదల కూడా బాగా అవుతుంది. జుట్టు సమస్యలను కూడా చెర్రీస్ తగ్గిస్తాయి. అధిక విటమిన్లు కలిగిన చెర్రీస్ ని తీసుకోవడం వల్ల జుట్టు కూడా బలంగా ఉంటుంది. ఇలా ఎన్నో రకాల సమస్యలను చెర్రీస్ తగ్గిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ వీటిని మీ డైట్ లో చేర్చండి ఆరోగ్యంగా ఉండండి.

TOP STORIES

జీవితంలో గెలవడానికి అలవర్చుకోవాల్సిన ఐదు అలవాట్లు..

కొన్ని అలవాట్లు మన జీవితాలని మార్చేస్తాయి. అలాగే మరికొన్ని అలవాట్లు మనల్ని విజయ తీరాలకి దూరంగా పడవేస్తాయి. ఇంకొన్ని అలవాట్లు విజయ సంద్రంలో నిత్యం తడిచేలా...