ఐరన్ లోపం వల్ల మనుషుల్లో రక్తహీనత కనిపిస్తుంది. శరీరంలో రక్తం తగ్గిపోవడమే రక్తహీనత. రక్తంలోని ఎర్ర రక్త కణాలు ఆరోగ్యకరంగా లేని పరిస్థితి వల్లనే రక్తహీనత ఏర్పడుతుంది. ఎర్ర రక్త కణాలు శరీర కణజాలాలకు ఆక్సిజన్ ని తీసుకువెళతాయి.
ఐరన్ లోపం కారణంగా శరీర కణజాలాలకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఇలాంటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి.
ప్రస్తుతం శరీరంలో ఐరన్ లోపం వల్ల కనిపించే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.
ఐరన్ లోపాన్ని తొందరగా గుర్తిస్తే బాగుంటుంది. కాకపోతే.. లోపం అనేది తక్కువగా ఉన్నట్లయితే దాని లక్షణాలు బయటకి కనిపించవు. కాకపోతే కొన్ని కొన్ని సార్లు శరీరం సంకేతాలను ఇస్తూ ఉంటుంది.
తీవ్రమైన అలసట
శరీరం బలహీనంగా మారిపోవడం
చర్మం పాలిపోయినట్లు మారడం
కాళ్ళూ, చేతులు చల్లబడటం
గోర్లు విరిగిపోయినట్లుగా కనిపించడం
ఆకలి లేకపోవడం
తలనొప్పి, వికారం,
ఛాతి నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు శరీరంలో ఐరన్ లోపం వల్ల కనిపిస్తాయి.
ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఐరన్ లోపం అనుకుని స్వయంగా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది కాదు. ముందుగా డాక్టర్ ని సంప్రదించడం మంచిది. ఎందుకంటే మీలో ఎంతవరకు ఐరన్ లోపం ఉందనేది డాక్టర్ కి మాత్రమే తెలుస్తుంది. మీకు మీరుగా మందులు వేసుకుంటే.. మీ లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.
ఐరన్ లోపాన్ని నివారించాలంటే తీసుకోవాల్సిన ఆహారాలు
చికెన్, మటన్, ఆకుకూరలు, చిక్కుళ్ళు, గింజలు వంటి వాటిల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ సి కలిగిన పండ్లు ఉసిరి, జామ మొదలైన వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే కాఫీ, టీలు వంటి వాటిని తీసుకోకపోతే మంచిది.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.