వీటిని తీసుకుంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది..!

-

మొక్కలకి చాలా శక్తి ఉంది. వాటి వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కొన్ని రకాల వాటిలో అయితే మెడిసినల్ గుణాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి మొదలు ఎన్నో సమస్యలను మనం తరిమికొట్టొచ్చు. అయితే వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం.

తులసి:

సర్వసాధారణంగా తులసి మొక్క అందరూ ఇంట్లోనే ఉంటుంది. తులసి ఆకుల్ని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వంటివి తగ్గుతాయి. ఆయుర్వేద గుణాలు ఉండే తులసి వల్ల చాలా సమస్యలు తగ్గించొచ్చు. మరుగుతున్న నీళ్ళలో కొన్ని తులసి ఆకులు వేసి తీసుకుంటే చక్కటి రిలీఫ్ ఉంటుంది.

లెమన్ గ్రాస్:

లెమన్ గ్రాస్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మంచి సువాసనతో ఇది ఉంటుంది. మీరు టీ లో లెమన్ డ్రెస్ వేసుకుని తీసుకుంటే ఒత్తిడి, డిప్రెషన్ వంటివి తగ్గుతాయి. అలానే అజీర్తి సమస్యలు కూడా తగ్గుతాయి.

వాము:

వాము ఆకులు కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గిస్తాయి. అలానే బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మీరు వాము ఆకులని తేనె, మిరియాలు లేదా పసుపుతో కలిపి తీసుకుంటే చక్కటి ప్రయోజనం పొందవచ్చు.

రోజ్ మేరీ:

రోజ్మేరీ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది అలానే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి మరుగుతున్న నీళ్ళల్లో ఈ ఆకులు వేసి తీసుకుంటే కూడా ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

ఒరిగానో:

ఒరిగానోలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి దీనిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలానే నొప్పుల్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి వీటిని కూడా మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి దానితో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news