గుండె అందరికీ ఒకేలా కొట్టుకోదట..?

-

హృదయస్పందన నిరంతరం ఉంటుంది. అప్పుడప్పుడు కాస్త నెమ్మదిగా.. కొన్నిసార్లు సూపర్ ఫాస్ట్ గా.. ఇంకొన్నిసార్లు మధ్యస్తంగా కొట్టుకుంటుంది. మనం చేసే పనులను బట్టి గుండె కొట్టుకునే విధానం ఆధారపడి ఉంటుంది. కేవలం మనిషి చేసే పనులను బట్టే గుండె వేగం మారడం కాదు.. హృదయస్పందన వేగం వ్యక్తులను బట్టి మారిపోతుంటుందట. అంటే గుండె కొట్టుకునే వేగం అందరిలో ఒకేలా ఉండదట.

heart
heart

 

గుండె వేగం అన్ని సమయాల్లోనూ ఒకే రీతిలో ఉండదు. అందరికీ ఒకేలా కొట్టుకోవాలని లేదు. రోజంతా మనం చేసే పనుల ఆధారంగా వేగం మారుతుంటుంది. గుండె వేగం వయస్సు తోనూ మారుతుందని వైద్యులు చెబుతున్నారు. గుండె కొట్టుకునే వేగం పరిశీలించి ఆరోగ్యాన్ని అంచనా వేస్తారు. మరీ గుండె వేగం తీరుతెన్నులను తెలుసుకుందాం.

 

  • గుండె సాధారణంగా నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. వేగంగా పరుగెత్తినప్పుడు గుండె వేగం పెరుగుతుంది. విశ్రాంతిలో ఉన్నపుడు నెమ్మదిగా పని చేస్తుంది.
  • విశ్రాంతి తీసుకునే సమయంలో ఆరోగ్యవంతుల్లో 60-100 మధ్యలో ఉంటుంది.
  • పరుగు, ఈత పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు 40సార్లు కొట్టుకుంటుంది.
  • విశ్రాంత వేళల్లో కూడా గుండె వేగంగా పని చేస్తుంటే..గ్లాసు నీళ్లు తాగితే నెమ్మదిస్తుంది.
  • కొద్దిసేపు గాఢంగా శ్వాస తీసుకోవడం, రోజుకు అరగంట వ్యాయామం చేయడం, మంచి పోషకాహారం తినడం, బరువు అదుపులో ఉంచుకోవడం, మద్యం, కెఫిన్‌ మితిమీరి తీసుకోకుండా ఉండటం, పొగ వ్యసనాన్ని వదిలేయడంతో గుండె పనితీరు మెరుగు పడుతుంది.
  • ఒత్తిడి తగ్గించే యోగాసనాలు ప్రాణాయామం, ధ్యానం మేలు చేస్తాయి.220 నుంచి వయస్సు తీసి వేయడంతో గుండె గరిష్ఠ వేగంగా చెబుతారు.

Read more RELATED
Recommended to you

Latest news