బరువు తగ్గడానికి సులువైన పద్ధతులు మీకోసం..!

-

చాలా మంది బరువు (Weight) తగ్గాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్లు కనుక ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే సులువుగా బరువు తగ్గొచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల సులువుగా బరువు తగ్గొచ్చు.

కానీ చాలా మంది సమయం లేక వ్యాయామం చేయడం లేదు. అటువంటి వాళ్ళు సింపుల్ గా వుండే ఈ టీ ని తయారు చేసుకుని ఇంట్లోనే ప్రయత్నం చెయ్యచ్చు. పైగా ఎంతో ఈజీగా బరువు కూడా తగ్గుతారు.

ఈ టీ కి కావలసిన పదార్థాలు:

బెల్లం
నిమ్మరసం

తయారు చేసుకునే విధానం:

దీని కోసం ముందుగా మీరు కొద్దిగా బెల్లం పొడిని తీసుకొని గోరు వెచ్చని నీళ్లల్లో కలపండి. తర్వాత దానిలో ఒక స్పూన్ నిమ్మరసం కూడా కలపండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని తాగేయండి. ఖాళీ కడుపున ప్రతిరోజు దీనిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. మెటబాలిజంని కూడా ఇది పెంచుతుంది.

అలానే ఇది బరువు తగ్గిస్తుంది. ప్రోటీన్ మరియు ఫైబర్ కూడా బెల్లంలో సమృద్ధిగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. ఇక నిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది కొవ్వు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అజీర్తి సమస్యని కూడా ఇది పోగొడుతుంది ఇలా బరువు తగ్గడానికి ఈ రెండు బాగా ఉపయోగపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news