స్కిప్పింగ్, రన్నింగ్ .. బరువు తగ్గడానికి ఏది ఎక్కువ సాయపడుతుంది?

-

చాలా తక్కువ ఖర్చులో అధిక కేలరీలను కరిగించడానికి అత్యుత్తమ మార్గం ఏదైనా ఉందంటే అది రన్నింగ్, స్కిప్పింగ్  Skipping, running అనే చెప్పాలి. ఈ రెండు పద్దతుల వల్ల చెమట చింది గుండె వేగం పెరుగుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ఎక్కువ అవుతుంది. ఐతే ఈ రెండింట్లో చాలా తేడాలున్నాయి. అవేంటో తెలుసుకుని బరువు తగ్గడానికి ఎవరికి ఏది బాగా పనిచేస్తుందో చూద్దాం.

రన్నింగ్, స్కిప్పింగ్/ Skipping, running

రన్నింగ్, స్కిప్పింగ్/ Skipping, running

కండరాల మీద భారం

రన్నింగ్, స్కిప్పింగ్ రెండింటి వల్ల కండరాల మీద భారం పడుతుంది. శరీరంలోని కిందిభాగం దీనివల్ల అటూ ఇటూ కదులుతుంటుంది. భుజాలు, పిరుదుల కదలిక ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చాలా త్వరగా కేలరీలు ఖర్చు అవుతాయి. కాకపోతే స్కిప్పింగ్ చేసేటపుడు పిరుదులు సాధారణంగా ఉండి, వెన్నెముక చివరి భాగం మీద భారం పడుతుంది.

కేలరీల ఖర్చు

స్కిప్పింగ్ వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. రన్నింగ్ తో పోలిస్తే 10నిమిషాల్లో 15కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. 10నిమిషాల రన్నింగ్ లో 125కేలరీలు కరిగిపోతే, 10నిమిషాల స్కిప్పింగ్ లో 140కేలరీలు కరుగుతాయి.

ఎవరు ఏది ఎంచుకోవాలంటే

మోకాలు, మడమ, నడుము నొప్పి ఉన్నవాళ్ళు రన్నింగ్, స్కిప్పింగ్ చేయడం సరైనది కాదు. దీనివల్ల ఆ ఇబ్బందులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల నడక, చిన్నపాటి పరుగు చేస్తే సరిపోతుంది. స్కిప్పింగ్ విషయానికి వస్తే రెండు కాళ్ళమీద ఒకేసారి దూకడం కాకుండా, ఒకే కాలుతో దూకడం చేయవచ్చు. ఈ రెండు వర్కౌట్లలో ఏది చేయాలన్న విషయానికి వస్తే, తక్కువ సమయం ఉన్నవారు స్కిప్పింగ్ చేసుకుంటే బెటర్.

Read more RELATED
Recommended to you

Latest news