బొప్పాయి నీళ్లు వల్ల ఎన్ని లాభాలో.. బరువు ఈజీగా తగ్గొచ్చట..!!

బొప్పాయి తింటే అందరూ వేడి చేస్తుంది అనుకుంటారు..కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచి చేసే పండు. బొప్పాయి పండు వల్ల ఏం లాభాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే..కానీ బొప్పాయి నీళ్ల వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..? బొప్పాయి నీళ్లేంటి అనుకుంటున్నారా.? బొప్పాయి నీళ్లు ఏంటో.. వీటి వల్ల ఉన్న ప్రయోజనాలు ఏంటో చూద్దామా…!

బొప్పాయి నీళ్లు ఎలా చేయాలంటే..

బొప్పాయి పండును ముందుగా సగానికి కట్‌ చేయాలి. ఆ తర్వాత పై తొక్క, బొప్పాయి గింజలను తీసేయండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బొప్పాయి ముక్కలను నీటిలో 5 నిమిషాల పాటు ఉడకబెట్టండి. మరిగించిన తర్వాత నీటిని చల్లారనివ్వండి.. ఈ నీటిని ఫ్రిజ్‌లో ఉంచి రెగ్యులర్‌గా తాగాలి. డైలీ ఈ డ్రింక్‌ను తాగొచ్చు.. ఇది మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇంకా వీటివల్ల లాభాలేంటంటే..

బొప్పాయి నీళ్ల వల్ల ప్రయోజనాలు..

బొప్పాయి నీళ్లలో విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్‌ను కూడా నివారిస్తుంది.
పొట్టకు కూడా చాలా మేలు చేస్తుంది.
ఇది రుతుస్రావం సమయంలో తీవ్రమైన నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
కిడ్నీలను ఆరోగ్యవంతంగా చేస్తుంది.
మైగ్రేన్ నొప్పిని కూడా నివారిస్తుంది.
బొప్పాయి నీటిని ఉదయాన్నే తాగడం వల్ల ప్రేగులను శుభ్రంగా ఉంచడంతో పాటు ఆరోగ్యంగా చేస్తుంది. కేవలం బొప్పాయి మాత్రమే కాదు ఏదైనా ఫ్రూట్ వాటర్ రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి నీళ్లు తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఇందులో పాపైన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రేగుల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
బొప్పాయి నీళ్లలో లైకోపీన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది. ఇక బొప్పాయిలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది, కానీ దానిని నీటిలో ఉడకబెట్టినప్పుడు, లైకోపీన్ దాని నుండి బయటకు వస్తుంది, ఇది శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.