ఏంటీ తరచుగా..నోరు ఎండిపోతుందా..? కారణం ఇదే కావొచ్చు..!

-

కొన్నిసార్లు..గొంతు ఎండిపోయినట్లు అనిపిస్తుంది. ఎంత వాటర్‌ తాగినా ఇలానే అనిపిస్తుంది..అప్పుడు మనం షుగర్‌ వాటర్‌, లెమన్‌ వాటర్‌ లాంటివి తాగుతుంటాం. ఇలా అప్పుడప్పుడు జరిగితే లైట్‌ తీసుకోవచ్చు. కానీ తరచూ అలానే అనిపిస్తున్నా.. వాటర్‌ తాగిన మీకు అదే ఫీల్‌ ఉన్నా.. ఇది తీవ్రమైన సమస్యకు చిహ్నంగా భావించవచ్చు. శరీరంలో వచ్చే మార్పులు..భవిష్యత్తులో వచ్చే రోగాలకు చిహ్నాలు.. వాటిని లైట్‌ తీసుకోకూడదు..
గొంతు ఎండిపోవడమనేది హై బ్లడ్ షుగర్‌కు సంకేతం కావచ్చు. తరచూ దాహం వేస్తుంటే అది డయాబెటిస్, ఎనీమియా, అల్జీమర్, స్ట్రోక్ వ్యాధులకు కారణం కావచ్చు. నోరు ఎండిపోవడం డయాబెటిస్ ప్రధాన లక్షణం. డయాబెటిస్ ఉన్నప్పుడు యూరినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా దాహం బాగా వేస్తుంది. శరీరంలో నీళ్లు తగ్గినట్టు అన్పిస్తుంది. నోరెండిపోతుంటుంది. అంతేకాకుండా చెమట పట్టడం, ఆకలి ఎక్కువగా వేయడం, తల తిరగడం ఇవన్నీ కూడా షుగర్ లక్షణాలే..
ఎనీమియా ఉన్నప్పుడు శరీరంలో రక్త హీనత ఏర్పడుతుంది. దీనివల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది. ఫలితంగా అలసట, తల తిరగడం, చెమట పట్టడం, నోరెండిపోవడం జరుగుతుంది.
ప్రెగ్నెన్సీ వల్ల శరీరంలో బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతో యూరిన్ ఎక్కువగా వస్తుంటుంది. ఫలితంగా నోరెండిపోవడం వంటి సమస్య ఏర్పడుతుంది. అందుకే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నీళ్లు ఎక్కువగా తాగమని వైద్యులు చెబుతుంటారు..
నోట్లో లాలాజలం తగ్గినా నోరు ఎండిపోతుంటుంది. టొబాకో, కొన్ని రకాల మందుల వాడకం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. లిక్విడ్ వస్తువులు ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లైతే.. పైన పేర్కొన్న వాటిలో ఏ కారణమో మీరు తెలుసుకోవాలి..అలాగే సమస్య తీవ్రతను బట్టి వైద్యులను సంప్రదించాలి.. శరీరంలో వచ్చే ఏ మార్పును కూడా తేలిగ్గా తీసుకోకూడదు.. చెప్పలేం ఏది కొంపముంచుతుందో.. గుండె ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. బీపీ, షుగర్‌ ఉన్నవారు అయితే మరింత అప్రమత్తంగా ఉండాలి.. ఎక్కువ స్ట్రెస్‌కు గురికావడం, జంక్‌ ఫుడ్స్‌ తినడం, ఆందోళనకు గురికావడం వీటన్నిటికి దూరంగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news