తేనెలో మన శరీరానికి కావల్సిన ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే పురాతన కాలం నుంచి తేనెను పలు ఔషధాల తయారీలో, అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు ఉపయోగిస్తున్నారు. అయితే తేనె వల్ల మనకు కలిగే అద్భుతమైన ప్రయోజనాల్లో ఒకటి బరువు తగ్గడం. తేనెను అధిక బరువును తగ్గించుకునేందుకు మంచి ఔషధంగా వాడవచ్చు. మరి అధిక బరువును తగ్గించుకోవాలంటే.. తేనెను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. నిత్యం ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 2 టీ స్పూన్ల తేనెను కలిపి తాగాలి. కొద్ది రోజుల్లోనే అధిక బరువు తగ్గుతారు.
2. ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం, రెండు టీస్పూన్ల తేనెను కలిపి తాగినా శరీరంలోని కొవ్వును కరిగించుకోవచ్చు.
3. దాల్చిన చెక్క పొడి 1 టీస్పూన్, రెండు టీస్పూన్ల తేనెలను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో బాగా కలిపి ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగితే అధిక బరువును ఇట్టే తగ్గించుకోవచ్చు.
4. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌లను కలిపి రోజూ రాత్రి పూట తాగాలి. అధిక బరువు తగ్గుతారు.
5. తేనె, నిమ్మరసం, అల్లం రసంలను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని అన్నింటినీ ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపునే తాగితే అధిక బరువును తగ్గించుకోవచ్చు.