కిడ్నీ సమస్యలు ఉన్నవారు రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నీళ్లు తాగితే..??

-

కిడ్నీ సమస్యలున్న వారికి ఏం తినాలి ఏం తినకూడదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం.. కొబ్బరి నీళ్లు కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి బాగా ఉపయోగపడతాయి. కిడ్నీ వ్యాధిగ్రస్తులు రాత్రి సమయంలో తీసుకుంటే శరీరానికి, ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అధిక రక్తపోటు ఉన్న రోగులకు కొబ్బరి నీరు ఇంకా ఉపయోగపడుతుంది.

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం ద్వారా ఆరోగ్యానికి తోడ్పడతాయి. కొబ్బరి నీటిలో హైడ్రేటింగ్, యాంటీ ఫంగల్ ,యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. అయితే రాత్రి పడుకునే ముందు కొబ్బరి నీరు తాగటం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ,పొటాషియం ఉంటాయి. ఇది గుండె సంరక్షణలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరి నీళ్లు తాగాలని నిపుణులు అంటున్నారు.

కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు తాగితే..

కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు రాత్రి తాగడం చాలా మంచిది. కొబ్బరి నీళ్లలోని పోషక విలువలు రాత్రంతా బాగా గ్రహించబడతాయి. అధిక రక్తపోటు ఉన్న రోగులకు కొబ్బరి నీరు ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తపోటును సహజంగా తగ్గించుకోవాలనుకుంటే . అయితే రక్తపోటును తగ్గించడానికి మందులు వాడుతుంటే మాత్రం కొబ్బరి నీటిని తీసుకోకూడదు. నిద్రకు ముందు కొబ్బరినీళ్లు తాగితే శరీరం డీహైడ్రేషన్‌కు గురికాదు. అదనంగా, ఈ నీరు శరీర ఆరోగ్యానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది..

రాత్రి నిద్ర పోయేటప్పుడు కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల తల నొప్పి, కడుపు నొప్పి మొదలైన సమస్యలు ఉండవు. బరువు పెరుగుతుంటే రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరినీళ్లు తీసుకుంటే బరువు అదుపులో ఉంచుకోవచ్చు. రాత్రి నిద్రపోవడానికి అరగంట ముందు కొబ్బరి నీరు తీసుకోవటం వల్ల చర్మం కాంతి వంతంగా మారుతుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారు నిద్రకు ముందు కొబ్బరి నీరు తాగటం వల్ల ప్రశాంతంగా నిద్రపడుతుంది. కొబ్బరి నీరే కాదు.. పచ్చికొబ్బరి తిన్నా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని రోజులు కొబ్బరి నీళ్లు ఉండకవపోవచ్చు..అలాంటప్పుడు పచ్చికొబ్బరి తిన్నా పర్వాలేదు. ఫేస్‌కు కూడా బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news