ఈ పండ్లు తీసుకుంటే పీరియడ్స్ టైం కి వస్తాయి..!

చాలా మంది మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో పీరియడ్స్ సమస్య ఒకటి. పీరియడ్స్ టైం కి రాకపోవడం వలన చాలా మంది ఇబ్బంది పడుతూ వుంటారు. చాలామంది మహిళలకి పీరియడ్స్ రెగ్యులర్ గా రావు అలానే టైం కి కూడా రావు. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ పండ్లను డైట్ లో తీసుకోండి. ఈ పండ్లను కనుక డైట్ లో చేర్చుకుంటే పీరియడ్స్ రెగ్యులర్ గా టైం కి వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే మరి పీరియడ్స్ టైం కి రావాలంటే ఎటువంటి పండ్లను తీసుకోవాలి అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

ఇర్ రెగ్యులర్ పీరియడ్స్ కి కారణాలు:

సరైన జీవనశైలి లేకపోవడం
నిద్రలేమి
అలసట
ఒత్తిడి
చెడు ఆహారపు అలవాట్లు
మానసిక సమస్యలు
వ్యాయామం చేయకపోవడం
రక్తహీనత

ఈ పండ్లను తీసుకోవడం మంచిది:

కానీ ఈ పండ్లను తీసుకుంటే నెలసరి రెగ్యులర్ గా వస్తుంది. టైంకి వస్తుంది. మరి అవేమిటో ఇప్పుడే చూసేద్దాం.

కమల పండ్లు:

కమల పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది ఇంఫ్లమేషన్ ని తగ్గిస్తుంది అలానే నిమ్మ, కివి, మామిడి పండ్లును కూడా మీరు తీసుకోవచ్చు.

దానిమ్మ పండ్లు:

దానిమ్మ పండుని తీసుకుంటే కూడా రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు కాబట్టి దాన్ని మని కూడా డైట్లో చేర్చండి.

అరటి పండ్లు:

అరటి పండ్లలో పొటాషియం, విటమిన్ బీ6 ఉంటాయి. పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి అరటి పండ్లు కూడా సహాయపడతాయి.

పైనాపిల్:

రెగ్యులర్ గా పీరియడ్స్ రావడానికి పైనాపిల్ కూడా హెల్ప్ అవుతుంది. అలానే మంచి కూరగాయలు, ఆకుకూరలు పండ్లని డైట్ లో తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది పీరియడ్స్ వలన కలిగే సమస్యలు కూడా దూరం అవుతాయి.