యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం అనేది నేడు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య.. మనం తినే ఆహారాన్ని బట్టే ఈ యూరిక్ యాసిడ్ బాడీకి అందుతుంది.. అలాగే మూత్రం రూపంలో బయటకు పోతుంది.. కానీ ఎప్పుడైతే ఇది బయటకు పోకుండా.. బాడీలోనే ఉంటుందో..కీళ్ల నొప్పులు, వాపులు, మూత్రపిండాల్లో రాళ్లు, షుగర్..ఇలా చెప్పుకుంటూ పోతే చాన్తాడంత లిస్ట్ ఉంది.. ఇలా బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగి.. కొంతకాలానికి కీళ్ల మధ్య స్పటికాలుగా పేరుకుపోతుంది.. ఎముకల ఆకారం మారుతుంది.. దీన్నే గౌట్ అంటారు.. మరి ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా..? ఇంటి చిట్కాలు ఒంటి కోసం..!!
టిప్ 1
ఒక గ్లాస్ సొరకాయ జ్యూస్‌ను తీసుకోవాలి. తరువాత అందులో వేయించిన వాము పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో వేయాలి. తరువాత ఇందులో పావు టీ స్పూన్ నల్ల మిరియాల పొడి వేసి బాగా కలుపండి.. ఈ విధంగా తయారు చేసుకున్న జ్యూస్‌ను ఉదయం అల్పాహారం చేసిన తరువాత తాగండి..ఈ విధంగా సొరకాయ జ్యూస్‌ను తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గడంతో పాటు రక్తంలో పేరుకుపోయిన ఇతర వ్యర్థ పదార్థాలు కూడా తొలగిపోతాయి. ఈ సొరకాయ జ్యూస్ క్రమంగా తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే మన శరీరంలో వచ్చిన మార్పులను గమనించవచ్చు.
టిప్ 2
తిప్పతీగ రసంతో యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడొచ్చు. తిప్పతీగ అందుబాటులో లేని వారు ఈ తీగ రసం మనకు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది.. ఈ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల కూడా మనం యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.
టిప్ 3
కలబంద జ్యూస్‌ను, ఉసిరి కాయల జ్యూస్‌ను కలిపి తీసుకోవడం వల్ల కూడా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. రెండింటిని సమపాళ్లల్లో తీసుకుని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
మద్యపానానికి దూరంగా ఉండాలి.
టీ, కాఫీలను తాగడం తగ్గించాలి.
ఈ సమస్యతో బాధపడే వారు నీటిని ఎక్కువగా తీసుకోవాలి.
మసాలా ఎక్కువగా ఉన్న ఆహారాలను, మాంసాహారాన్ని, జంక్ ఫుడ్ ను, తీపి పదార్థాలను తీసుకోవడం చాలా తగ్గించాలి.
ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.