తొడభాగంలో కొవ్వు పేరుకుపోయిందా..తగ్గాలంటే ఈ చిట్కాలు ట్రై చేసేయండి!

-

కొవ్వు..ఇది మన శరీరంలో ఎక్కడంటే అక్కడ ఉంటుంది. కొంతమందికి పొట్టచుట్టు పేరుకుపోతే..మరికొంతమందికి తొడల భాగంలో. శరీరం అంతా సన్నాగా ఉన్నా..తొడల భాగంలో కొవ్వు పేరుకుపోతే..చూడ్డానికి ఏమంత బాగుండదు. జీన్స్ లాంటివి వేసినప్పుడు ఇంకా లావుగా కనిపిస్తారు. మీకు కూడా ఈ సమస్య ఉంటే..ఈ చిట్కాలను ఫాలో అయిపోండి.

సైక్లింగ్ చేయడం వల్ల కాళ్లు, తొడలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీనివల్ల తొడ భాగంలో ఉండే కొవ్వు ఈజీగా కరిగిపోతుంది. కాబట్టి మీరు చేసే వ్యాయామాల్లో భాగంగా దీన్ని కూడా ప్రయత్నించండి. అలాగే షాపుకి, జిమ్ సెంటర్‌కు, మార్కెట్‌కు.. ఇలా దగ్గరి దూరాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సైకిల్‌పై వెళ్లడం అలవాటు చేసుకోండి.

మీరు పై అంతస్తులకు వెళ్లడానికి లిఫ్ట్, ఎస్కలేటర్లు వాడకుండా..చక్కగా మెట్లెక్కి వెళ్లండి. దీనివల్ల తొడ కండరాలు చురుగ్గా పనిచేస్తాయి. ఫలితంగా ఈ భాగంలో క్రమంగా కొవ్వు తగ్గే అవకాశం ఉంటుంది.

పోషకాలు ఎక్కువగా.. క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని క్యాలరీలు తగ్గి ఫలితంగా బరువు తగ్గుతారు. ప్రతిరోజూ ఫ్రెండ్స్‌తో కలిసి కాసేపు బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ ఆడండి. దీంతో ఎంజాయ్‌మెంట్‌తో పాటు తొడ భాగంలో కొవ్వు కూడా కరుగుతుంది.

గోడకుర్చీ వేసినట్లుగా కుర్చోటం (స్క్వాట్స్) వల్ల కూడా తొడ భాగంలోని కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల సమస్య తగ్గుతుంది.

గడ్డిమీద నడవడం, జాగింగ్ చేయడం లాంటి వాటి వల్ల కేవలం తొడల భాగంలోనే కాకుండా.. శరీరంలో పేరుకుపోయిన అదనపు క్యాలరీలు, కొవ్వు కరిగి ఫలితంగా బరువు తగ్గచ్చు. ఈ వ్యాయామాలు ఉదయం చేయడమే ఉత్తమం. ఎందుకంటే ఉదయం పూట గాలిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. తాజా గాలిని పీల్చుకోవడం వల్ల శరీరంలోని క్యాలరీలు త్వరగా కరిగుతాయట.

లెగ్ ఎక్స్‌టెన్షన్ మెషీన్. పై కూర్చుని కాళ్లను నెమ్మదిగా ముందుకు చాపుతూ తిరిగి వెనక్కి తీసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. త్వరగా తగ్గాలని వేగంగా చేస్తే తొడల భాగంలో ఉండే కండరాలకు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. అయితే జిమ్ లో సాధ్యమవుతుంది. ఇంట్లో అయితే ఖర్చుతో కూడుకున్న పని

శరీరంలోని ప్రతి కండరం దృఢంగా మారడానికి సరైన వ్యాయామం అంటే ఈతకొట్టడమే. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి నాజూగ్గా తయారుకావచ్చు. ఇది కూడా తొడ భాగంలో కొవ్వు కరగడానికి సహాయపడే వ్యాయామాల్లో ఒకటి. అయితే మీకు రాకుంటే తెలిసిన వాళ్ల పర్యవేక్షణలోనే చేయండి. చిన్నప్పడి నుంచి మీ పిల్లలకు ఈత కొట్టటం నేర్పించండి. దానివల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలకు దూరంగా ఉండొచ్చు.

ఇలా మీకు సులువుగా ఉండే వాటిని డైలీ చేస్తుంటే..కొవ్వు క్రమక్రమంగా తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news