ఉదయం 8.30 లోపు బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తే టైప్‌ 2 డయబెటీస్‌ రాదంటున్న శాస్త్రవేత్తలు

-

మధుమేహం: ఈరోజుల్లో హెల్తీ లైఫ్‌ స్టైల్‌ పాటించేవాళ్లను వేళ్లమీద లెక్కసుకోవచ్చు.. అంత తక్కువ మంది ఉంటున్నారు. కొందరికి కుదరక అలా ఉంటుంటే.. మరికొందరు మాత్రం తెలియక ఇలా తయారవుతున్నారు. నైట్‌ షిఫ్ట్‌లు ఉన్నవాళ్లకు తప్పదు.. కాబట్టి రాత్రుళ్లు మేల్కోని జాబ్‌లు చేస్తారు.. కానీ కొంతమంది ఉంటారు. వాళ్లకు అసలు ఏం అంత ముఖ్యమైన పని ఉండదు.. అయినా అర్ధరాత్రి వరకూ సోషల్‌ మీడియాలో అవి ఇవి చూస్తూ టైమ్‌ అంతా వేస్ట్ చేస్తారు. రాత్రి ఎంత త్వరగా పడుకుంటే ఉదయం అంత త్వరగా లేవొచ్చు.. ఈ రెండు కరెక్టుగా జరిగితే మనిషి ఆరోగ్యం బాగుంటుంది.. ఉదయం 8.30లోపు బ్రేక్‌ ఫాస్ట్‌ చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? ముఖ్యంగా షుగర్‌ లాంటి దీర్ఘకాలిక రోగాల భారిన పడకుండా ఉండొచ్చు..

మధుమేహం
మధుమేహం

 

బ్రేక్‌ఫాస్ట్‌ను రోజూ ఉద‌యం 8.30 గంట‌ల లోపు పూర్తి చేస్తే టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాల ద్వారా కనుగొన్నారు.. మొత్తం 10,575 మందికి చెందిన వివ‌రాల‌ను సైంటిస్టులు సేక‌రించి అధ్య‌య‌నాల్లో భాగంగా విశ్లేషించారు. దీంతో తెలిసిందేంటంటే.. ఉద‌యం 8.30 లోపు బ్రేక్‌ఫాస్ట్ చేసే వారిలో షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉన్నాయ‌ని, వారికి టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గాయ‌ని, ఇన్సులిన్ నిరోధ‌క‌త త‌గ్గింద‌ని గుర్తించారు. అందువ‌ల్ల వీలైనంత త్వ‌ర‌గా బ్రేక్‌ఫాస్ట్‌ను ముగించేయాల‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు.

ఇక బ్రేక్‌ఫాస్ట్‌లో పిండి ప‌దార్థాలు త‌క్కువ‌గా, కొవ్వులు, ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాల‌ని సైంటిస్టులు తెలిపారు. దీని వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు బాగా అదుపులో ఉంటాయ‌ని చెప్పారు. ఈ విధ‌మైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే టైప్ 2 డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఈ మేర‌కు సైంటిస్టులు త‌మ అధ్య‌య‌నాల తాలూకు వివ‌రాల‌ను ఎండోక్రైన్ సొసైటీ వార్షిక స‌మావేశంలో వెల్ల‌డించారు.

అసలు బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్‌ చేస్తే..

చాలామంది ఉన్న పెద్ద చెడ్డ అలవాటు బ్రేక్‌ ఫాస్ట్‌ను స్కిప్‌ చేయడం.. ఉదయం లేటుగా లేవడం.. అటు ఇటుగా మధ్యాహ్నం 12 గంటలకు ఒకేసారి లంచ్‌ చేయడం లాంటివి చేస్తుంటారు.. ఇలా చేయడం వల్ల మీకు భవిష్యత్తులో చాలా రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఉదయం కడపునిండా తినాలి.. మధ్యాహ్నం ఇంకాస్త తక్కువగా తినాలి.. రాత్రి ఇంకా తక్కువగా తినాలి. కానీ మనం ఇది రివర్స్‌లో ఫాలో అవుతాం.. మీరు ఇంతేనా..? ఉదయం వీలైనంత త్వరగా లేచి బ్రేక్‌ ఫాస్ట్ చేసేలా ప్లాన్‌ చేసుకోండి..!

Read more RELATED
Recommended to you

Latest news