రాత్రి నిద్రపోయే ముందు వీటిని తీసుకుంటే ఆరోగ్యం మరెంత బాగుంటుంది..!

-

మన ఆరోగ్యం బాగుండాలంటే డైట్ లో మంచి ఆహారం తీసుకోవాలి. ఆహారం ఎంత ఆరోగ్యకరమైందో మన ఆరోగ్యం అంత బాగుంటుంది. ముఖ్యంగా రాత్రిపూట తీసుకునే ఆహారం పై నిద్ర ఆధారపడి ఉంది. మంచి నాణ్యమైన నిద్ర ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి రాత్రిపూట తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం. అందుకని దాని మీద దృష్టి పెట్టాలి. అయితే మరి రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.

 

బాదం:

రాత్రిపూట నిద్ర పోయే ముందు బాదం తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. బాదంలో మెలటోనిన్ ఉంటుంది. ఇది నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.

చమోలి టీ:

రాత్రి నిద్ర బాగా పట్టాలంటే చమోలి టీ ని కూడా తీసుకోండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది మంచి నాణ్యమైన నిద్రని ఇస్తుంది.

కివి:

కివి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా రాత్రి దీనిని తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కివిలో సెరోటోనిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

వాల్ నట్స్:

వాల్ నట్స్ కూడా మంచి నిద్రను ఇస్తాయి. వాల్ నట్స్ లో మెలటోనిన్ మరియు హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి.

అన్నం:

అన్నం కూడా రాత్రిపూట తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. మంచి నిద్రని ఇది ఇస్తుంది.

అలానే రాత్రిపూట డైరీ ప్రొడక్ట్స్, అరటి పండ్లు, ఓట్ మీల్ వంటివి తీసుకుంటే కూడా నిద్ర బాగా పడుతుంది. దీంతో ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి రెగ్యులర్ గా రాత్రి నిద్రపోయే ముందు ఈ ఆహార పదార్థాలను తీసుకోండి. దీంతో మీ ఆరోగ్యం మరింత ఇంప్రూవ్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news