బరువు తగ్గాలంటే.. ఈ టైమ్‌టేబుల్‌ ఫాలో అయితే చాలు..!

-

ఇప్పుడున్న లైఫ్‌స్టైల్‌ వల్ల ఊబకాయం రావడం అందరికీ కామన్‌ అయిపోతుంది. అసలే కుర్చోని చేసే పనుల వల్ల బొజ్జ ఇంకాస్త ముందుకొస్తుంది. ఆహారపు అలవాట్లు సరిగా ఉంటే బరువు మన మాట వింటుంది. మరి హెల్తీ డైట్‌ ఫాలో అవ్వాలంటే..బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి డిన్నర్‌ వరకూ ఏం తీసుకోవాలో చూద్దామా..!

బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తీసుకోవాలి

చాలమంది బ్రేక్‌ఫాస్ట్ స్కిప్‌ చేసి అటుఇటుగా మధ్యాహ్నానికి లంచ్‌ చేద్దాం అనుకుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. బ్రేక్‌ఫాస్ట్ తప్పకుండా తీసుకోవాలి. అల్పాహారంలో చాలామంది పరాఠా, ఫ్రైడ్ పదార్ధాలు తింటుంటారు. కానీ రవ్వ దోశె ఆరోగ్యానికి మంచిది. రవ్వ దోశ అనేది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రవ్వ దోశెలో కాస్త బట్టర్ వేసుకుంటే ఇంకా మంచిది. తేలిగ్గా ఉంటూనే..ఎక్కువ ప్రోటీన్లు కలిగి ఉంటుంది. ఎగ్ చాట్ ప్రొటీన్ కూడా మంచిదే. ఇందులో గుడ్ ఫ్యాట్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గేందుకు మంచి డైట్ ఇది. దీనివల్ల ఆకలి త్వరగా వేయదు. అదే సమయంలో ఎనర్జీ కూడా లభిస్తుంది.

లంచ్‌లో..

ఇక లంచ్‌లో అన్నం మానేసి.. పరాఠాలు తీసుకోవడం మంచిది. పరాఠా పిండిలో వాము కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. పరాఠాలను ఆలివ్ ఆయిల్‌తో కాల్చితే ఆరోగ్యపరంగా మంచిది. ఇష్టమైన కూరతో పరాఠాలు కడుపు నిండుగా తీసుకోవచ్చు. ఆకుకూరలు తీసుకోవడం ఇంకా మంచిది.

రాత్రి భోజనం..

మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఆవకాడో శాండ్‌విచ్ రాత్రి వేళ చాలా మంచిదంటున్నారు. మల్టీగ్రెయిన్ బ్రెడ్ రెండు స్లైడ్స్ తీసుకుంటే చాలు. అవకాడో గురుజు స్లైడ్స్‌కు రాసుకుని తినాలి. అదనంగా కేరట్, షిమ్లా మిర్చి, పన్నీర్ వేస్తే ఇంకా మంచిది. ఈ విధమైన డైట్ ఆరోగ్యానికి మంచిదే కాకుండా..బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారు డైలీ ఈ ఆహారం తీసుకుంటే..మూడు నెలల్లోనే మంచి మార్పులు వస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news