నలభైల్లో పురుషులు ఈ హెల్త్ టిప్స్ ని పాటిస్తే బెస్ట్..!

-

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా నలభై ఏళ్లు మరియు 40 ఏళ్లు దాటిన పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యకాలంలో హార్ట్ ఎటాక్ మొదలైన సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవించాలంటే ఈ టిప్స్ పాటించండి.

 

విటమిన్ డి:

టెస్టోస్టిరాన్ లెవెల్స్ తక్కువగా ఉండటం వల్ల మెటబాలిజం తగ్గుతుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక విటమిన్ డి ని ఆహారంలో ఎక్కువగా ఉండేటట్లు తీసుకోవాలి. పురుషులు విటమిన్ డి తీసుకోవడం వల్ల కరోనరి హార్ట్ డిసీజెస్ తగ్గుతాయి. అదే విధంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

మెగ్నీషియం:

మెగ్నీషియం కూడా సరిపడా తీసుకోవాలి. రెగ్యులర్ గా కాఫీ, టీ మొదలైన వాటిని తీసుకుంటే మెగ్నీషియం లోపం కలుగుతుంది. అందుకని అలా లేకుండా మెగ్నీషియం ఉండేటట్టు చూసుకోవాలి.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:

ఒమేగా లోపం ఉండడం వల్ల హృదయ సంబంధిత సమస్యలు, మూడ్ స్వింగ్స్, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మోకాళ్ళ నొప్పులు మొదలైన సమస్యలు వస్తాయి. అందుకని అలాంటి సమస్యలేమీ రాకుండా ఉండాలంటే వీటిని తీసుకుంటూ ఉండాలి.

జింక్:

అనారోగ్య సమస్యలు తరిమికొట్టడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి జింక్ ఉపయోగపడుతుంది. బెర్రీస్, సిట్రస్ ఫ్రూట్స్, కివి, ఆపిల్స్, ద్రాక్ష మొదలైనవాటిని తీసుకుంటే జింక్ అందుతుంది.

విటమిన్ బి 6 :

విటమిన్ బి6 అరటి పండ్లు, బంగాళదుంపలు, టోఫు మొదలైన వాటిలో దొరుకుతుంది. ఎక్కువకాలం మద్యపానం వాళ్ళల్లో ఈ లోపం ఉంటుంది. దీనితో హైపో థైరాయిడిజమ్, డయాబెటిస్ వంటి సమస్యలు కూడా వస్తాయి. ఏది ఏమైనా ధూమపానానికి, మద్యపానానికి దూరంగా ఉండాలి రెగ్యులర్ గా వ్యాయామం చేసి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలు లేకుండా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news