గ్రీన్ టీ తో పాటు వీటిని తీసుకుంటే మంచిది..!

-

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బరువుని కూడా ఈజీగా తగ్గొచ్చు. అయితే గ్రీన్ టీ లో వీటిని కూడా మీరు కలుపుకుని తీసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే ఎక్కువ లాభాలను పొందవచ్చు. అయితే మరి గ్రీన్ టీ లో ఎటువంటి పదార్థాలు కలుపుకుని తీసుకుంటే మంచిది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం పూర్తిగా చూసేయండి.

greentea
greentea

నిమ్మరసం

నిమ్మరసం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వల్ల మనం ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు. గ్రీన్ టీ యొక్క చేదుని నిమ్మరసం తగ్గిస్తుంది. నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కనుక గ్రీన్ టీ తో పాటు దీనిని తీసుకుంటే చాలా మంచిది. మీరు గ్రీన్ టీ లో ఒక చెక్క నిమ్మరసం పిండుకుని తీసుకుంటే చక్కని ప్రయోజనాలు పొందవచ్చు.

అల్లం

అల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అల్లాన్ని కూడా మీరు గ్రీన్ టీ లో కలుపుకుని తీసుకుంటే చక్కని ప్రయోజనం కలుగుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలానే క్యాన్సర్ రాకుండా రక్షిస్తుంది. కనుక గ్రీన్ టీ తో అల్లం కూడా తీసుకోండి.

పుదీనా మరియు దాల్చిని

పుదీనా మరియు దాల్చిని కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పుదీనా ఆకులను గ్రీన్ టీలో వేసుకుని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలానే జీర్ణ ప్రక్రియని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ రెండిటినీ కలిపి మీరు గ్రీన్ టీ తీసుకుంటే ఆకలి ఎక్కువగా వేయదు. అలాగే బరువు తగ్గడానికి కూడా ఇది బాగా సహాయం చేస్తుంది. కనుక ఈ పదార్థాలని మీరు వేసుకొని గ్రీన్ టీ తీసుకుని చక్కటి ప్రయోజనాలను పొందండి. ఆరోగ్యంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news