ఆహారం విషయంలో ఈ తప్పులు చేస్తే ప్రమాదమే..!

ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం బాగుండాలి. పోషక పదార్థాలు ఉండే ఆహారం తీసుకోవాలి. అయితే ఆహారం విషయంలో ఈ తప్పులు చేయకూడదు. అయితే మరి ఎటువంటి వాటిని పాటిస్తే మంచిది. దేని వల్ల ఇబ్బంది వస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసమే పూర్తిగా చూసేయండి.

ఆహారం విషయంలో చేయాల్సినవి:

హైడ్రేట్ గా ఉండడం:

ప్రతిరోజూ ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల మంచి నీళ్ళు తాగి హైడ్రేట్ గా ఉండాలి. దీనివల్ల జుట్టుకి, చర్మానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది.

ప్రోటీన్ తీసుకోవడం:

ప్రోటీన్ కలిగిన అల్పాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కాబట్టి అల్పాహారంలో ఎక్కువ ప్రోటీన్స్ ఉండేటట్లు చూసుకోండి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు మొదలైన వాటిని తీసుకుంటే మంచిది.

త్వరగా డిన్నర్ చేసేయండి:

రాత్రి డిన్నర్ చేసేటప్పుడు త్వరగా తినేయాలి. అదే విధంగా తక్కువ మోతాదులో తీసుకోవాలి ఇలా చేయడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. గుండెల్లో మంట వంటి సమస్యలు ఉండవు.

ఆహారం విషయంలో చేయకూడనివి:

ఎప్పుడూ కూడా తినకుండా ఉండద్దు:

ఎప్పుడూ కూడా రెగ్యులర్ గా తినాలి. చాలా మంది మీల్స్ ని స్కిప్ చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు.

షుగరీ డ్రింక్స్ తీసుకోవద్దు:

సోడా, షుగర్ ఉండే డ్రింక్స్ వంటి వాటిని తీసుకోకపోవడమే మంచిది.

త్వరగా తినకండి:

సమయం ఎక్కువగా తీసుకుని నెమ్మదిగా తింటూ ఉండండి. ఒకేసారి వేగంగా తినడం అస్సలు మంచిది కాదు. అలానే ఇన్స్టంట్ ఫుడ్స్ కి దూరంగా వుండండి.