కేఆర్ఎంబి అధికారులపై తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మండిపడింది. ఏపీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ లేఖలు రాసి అధికారులను వేదిస్తోందని తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ ఫైర్ అయ్యారు. కల్వకుర్తి లాంటి ప్రాజెక్టులు 1980లో శంకుస్థాపన చేశారని… అలాంటి ప్రాజెక్టు అనధికార ప్రాజెక్టు ఎలా అవుతుందన్నారు. ఏపీ రాసిన ప్రతీ లేఖ పై కేఆర్ఎంబి – జిఆర్ఎంబీ తెలంగాణ వివరణ కోరడం ఏంటీ ? అని నిలదీశారు.
ప్రాజెక్టుల పూర్వపరాలు తెలుసుకోకుండా బోర్డులు తెలంగాణకు సమాధానాలు ఇవ్వాలని ఎలా అడుగుతారన్నారు. నీటి వివాదాలల్లో నెలకొన్న అంశాలపై ఇవాళ్టి సమావేశంలో తెలంగాణ తరుపున గట్టి వాదనలు వినిపిస్తామని.. తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగింది. తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం మీటింగ్ లో ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. కృష్ణా బిసిన్ నుంచి ఏపీ తరలిస్తున్న నీటిపై ముందు నుండి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుందని.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమ ప్రాజెక్టు, దీనిపై కేఆర్ఎంబి ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు.
కృష్ణా జాలాల్లో తెలంగాణకు యాబై శాతం ఇవ్వాల్సిందేన్నారు. తెలంగాణ జనాభా పెరుగుతుంది. కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణలో పెద్ద పరిశ్రమలు స్థాపిస్తున్నారు. నీటి వాటా కచ్చితంగా పెంచాలని పేర్కొన్నారు. టేలిమెట్రీల విషయంలో కేఆర్ఎంబి భాద్యత రాహిత్యంగా వ్యహరిస్తోందని.. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ పదే పదే బోర్డులకు లేఖలు రాసి వేధిస్తున్నారని నిప్పులు చెరిగారు. విభజన చట్టం ప్రకారం కేఆర్ఎంబి ఏపీకి తరలించవచ్చు… కానీ వైజాగ్ తరలించడం కృష్ణా బేసిన్ దాటి గోదావరి బేసిన్ లో పెట్టడం అవుతుంది… ఇది సరికాదన్నారు.