మూత్రపిండాల క్యాన్సర్: చేయాల్సిన, చేయకూడని విషయాలివే..

-

మూత్రపిండాలు మన శరీరంలో ముఖ్యమైన అవయవాలు. శరీరంలోని విష పదార్థాలని బయటకి తోసేసే ఈ అవయవాలు చాలా ముఖ్యమైనవి. ఐతే మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే చర్యలు చాలా జరుగుతుంటాయి. అలాంటి వాటిలో మూత్రపిండాల క్యాన్సర్ చికిత్సకి మరింత ప్రత్యేక శ్రద్ధ అవసరం. చాలా వరకు క్యాన్సర్ చికిత్సలు వికారాన్ని కలిగించడంతో పాటు, జీర్ణ సమస్యలను తెచ్చిపెడుతుంది. ఏదైనా తినాలంటే నోట్లో పుండ్లు ఏర్పడడం వంటి సమస్యలు ఏర్పడతాయి. అందుకే క్యాన్సర్ చికిత్సకి వెళ్ళిన వారు తాము తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలని పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలని తీసుకోవాలి.

చేయాల్సిన పనులు

ఆరోగ్యకరమైన ఆహారాలని తినాలి.

దీనివల్ల శరీర జీవక్రియలు సక్రమంగా జరిగి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. చికెన్, సోయా వంటి ప్రోటీన్ గల పదార్థాలని ఆహారంగా తీసుకుంటే బెటర్.

ప్రోటీన్

మూత్రపిండాల క్యాన్సర్ చికిత్స చేసుకున్నవారు ప్రోటీన్ ని తినాల్సి ఉంటుంది. ఐతే ఇది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. అందుకే మీకెలా అయితే బాగుంటుందో తెలుసుకుని ఆహారంలో భాగం చేసుకుంటే బాగుంటుంది.

ఫాస్ఫరస్:

గింజలు, విత్తనాలు, మొలకల్లో ఫాస్పరస్ ఉంటుంది. ఈ ఆహారాలని తింటే శరీరానికి కావాల్సిన ఫాస్ఫరస్ అందుతుంది. అలాగే పాల పదార్థాలని అధికంగా తీసుకోకూడదు. రోజులో 300మిల్లీ లీటర్ల కంటే ఎక్కువ పాల పదార్థాలని ఆహారంగా తీసుకోకూడదు.

ఆహారం క్వాంటిటీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మూత్రపిండాల క్యాన్సర్ చికిత్స తీసుకున్నవారికి మలబద్దకం ఒక సమస్యగా మారుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.

చేయకూడని పనులు

ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే వాటి భారం అంతా మూత్రపిండాల పైనే పడుతుంది కాబట్టి వాటిని తీసుకోవడం తగ్గించాలి.

ఎక్కువ ఉప్పు కలిగిన పదార్థాలని వదిలివేయాలి. ప్రతీ రోగానికి ఒకే నియమం అని చెప్పి మీకు నచ్చిన వాటిని అనుసరించవద్దు. ఏది మంచో ఏది చెడో తెలుసుకోండి.

వ్యాయామం చేయడం మర్చిపోవద్దు. పొద్దున్న లేచి కనీసం అరగంటైనా ఆరోగ్యం గురించి సమయం వెచ్చించాలి.

Read more RELATED
Recommended to you

Latest news