డైట్ లో ఉన్నారా? ఆకలి వేస్తుందా? ఐతే ఏమి తినాలో, ఏమి తినవద్దో తెలుసుకోండి.

-

డైట్ లో ఉన్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుందని, దానివల్ల డైట్ ఫాలో అవడం కష్టంగా మారుతుందని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. రోజువారి ఆహారపు అలవాట్లలో కొద్దిగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించినపుడు ఇలాంటి ఇబ్బందులు సహజమే. నోరూరించే ఫుడ్ కనిపించేనపుడూ ఆటోమేటిక్ గా ఆకలి మొదలవుతుంది. ఇలాంటి సమయాల్లో ఎలాంటి ఆహారాలు ఆరోగ్యానికి మంచివి? ఎలాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల ఆకలి తగ్గి కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది? వంటి విషయాలను ఇక్కడ చర్చిద్దాం.

ఎలాంటి ఆహారాలను తినకూడదు?

నూడిల్స్ వంటి ఫాస్ట్ ఫుడ్ ఆహారాలను అస్సలు ముట్టుకోవద్దు. రెండు నిమిషాల్లో రెడీ చేసుకోగలిగే ఆహార పదార్థాలను కూడా పక్కన పెట్టేయండి.
చాలామంది బిస్కట్స్ తింటుంటారు. ఇంకొంతమంది తమ బ్యాగుల్లో వేఫర్స్ ఉంచుతుంటారు. డైట్ లో ఉన్నప్పుడు ఈ రెండూ సరైన ఆహారాలు కాదు.
జ్యూసులు, చక్కెరతో నిండిన చాక్లెట్ బార్స్ మొదలగునవి సరైనవి కావు.

మరి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి?

ఆపిల్, పీనట్ బట్టర్

పీనట్ బట్టర్ తో ఆపిల్ కలుపుకుని ఆహారంగా తీసుకోవడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల ఆకలి తొందరగా వేయకుండా ఉంటుంది.

6బాదం, 3ఖర్జూరం

తీపి పదార్థాలు తినాలన్న కోరిక ఎక్కువగా ఉన్నప్పుడు చాక్లెట్ వంటి వాటిని పక్కన పెట్టి బాదం, ఖర్జూరం తినండి. బాగుంటుంది.

కాల్చిన శనగలు, తడిపిన అటుకులు

కాల్చిన శనగలను తడిసిన అటుకులు (పోహా)తో కలుపుకుని ఆహారంగా తీసుకోవడం వల్ల అందులోని ప్రోటీన్లు, శరీరానికి అందుతాయి. అంతేకాదు, వీటివల్ల రక్తంలోని చక్కెర శాతం పెరగకుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news