సహజ పసుపుతో బోలెడు లాభాలు.. ఎలా అంటే..?

-

పసుపు ప్రకృతి ప్రసాధించిన దివ్య ఔషధం. మన భారత దేశంలో పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది. మంచి యాంటీ బయోటిక్ కూడా. వీటిలో ఉండే ఆయుర్వేద గుణాలు మన శరీరానికి ఎంతో సహాయ పడతాయి. మన భారత దేశంలో పసుపును వంటల్లోనూ.. శుభకార్యలలోనూ ఉపయోగిస్తారు. పూర్వం మన వాళ్ళు ఎక్కువగా పసుపును కాళ్లు, చేతులకు మరియు ఇంటి ముందు గుమ్మనికి రాసేవారు. ఇలా చేయడం వలన క్రిములు, కీటకాలు ఇంటి లోపలికి రావని పెద్దలు చెప్పేవారు. ప్రతిరోజు పసుపు రాయడం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్ ని దరిచేరనీయదు. ఇందులో కర్కుమిన్ అనే సహజ పదార్థం ఉంటుంది.పసుపులో విటమిన్లు, లవణాలతో పాటు శరీరారోగ్యానికి తోడ్పడే ఫైటిన్, ఫాస్ఫరస్ కూడా అధికంగానే ఉంటుంది. మరి ఇన్ని గుణాలు కలిగిన ఈ సహజ పసకులో ఎలాంటి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం..

పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువలన మన చర్మానికి గాయాలు అయినప్పుడు పసుపు పూయడం వలన ఆ గాయాలు క్రమేపీ తగ్గుముఖం పడతాయి.పసుపు ను ప్రతిరోజు పొద్దున్నే గోరవెచ్చని నీళ్లలో కలిపి తీసుకోవడం వలన బరువు తగ్గుతారు.పసుపులో ఉండే యాంటీ ఆక్సైడ్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి.దగ్గు, జలుబు ఉన్నప్పుడు మరుగుతున్న నీటిలో కాస్త పసుపు కలిపి ఆవిరి పట్టుకోవాలి. ఇలా చేయడం వలన వాటి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

గొంతులో కఫం ఉన్నప్పుడు వేడి పాలల్లో కొద్దిగా పసుపు కలిపి త్రాగడం వలన కఫం తగ్గుతుంది.నొప్పులు, బెణుకులు ఉన్నప్పుడు పసుపు, ఉప్పు, సున్నము బాగా కలిపి పట్టు వేసుకోవాలి.చర్మం మీద మొటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం స్నానం చేయడానికి ముందు ఒక అరగంట పసుపును ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే చర్మం మీద మొటిమలు, మచ్చలు తగ్గు ముఖం పడతాయి.
ముఖం మీద టాన్ ఎక్కువగా ఉన్నప్పుడు పసుపులో కొంచెం బాదం నూనె, శనగపిండిని కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం మీద రాయడం వలన ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news