చిన్నపనులకే అలసి పోతున్నారా? వీటితో ఎనర్జీ తెచ్చుకోండి!

-

తలనొప్పి, కడుపులో వికారంగా ఉండడం, కండరాల నొప్పులు, మూడీగా ఉండడం, ఆకలి మందగించడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం ఏకాగ్రత లోపించడం.. ఇవన్నీ అలసిపోతున్నట్లు తెలిపే చిహ్నాలు. వీటిలో ఏది ఎదురైనా బలహీనంగా తయారవుతున్నారా? ఈ సమయంలో ఏ పని చేయలేకపోతున్నారా.. అయితే ఈ పనులు చేయండి. అలసట పోయి ఉత్సాహంగా పనిలో నిమగ్నమవుతారు.

– ప్రస్తుత కాలంలో కంప్యూటర్‌ లేనిదే ఏ పనీ జరగడం లేదు. కాబట్టి కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేయడం, టీవీ చూడడం వంటివి కాస్త తగ్గించుకోవాలి. దీర్ఘకాలికంగా డిప్రెషన్‌, యాైంగ్జెటీ కలిగిస్తున్న కారణాలు జీవితంలో ఏమున్నాయో గుర్తించాలి. ఆ తర్వాత వాటితో రాజీపడడమో లేక కౌన్సిలింగ్‌ సాయమో తీసుకోవాలి.
– జీవితాన్ని హాయిగా, ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నించండి. రోజూ కనీసం 10 నిమిషాలైనా నడవండి. శరీరానికి సరైన ఆహారం, వ్యాయామం, మనసుకు తగినంత ప్రశాంతత ఉంటే నీరసం, నిస్సత్తువ మీ దరికి చేరదు.


– శరీరంలో నీరు లేకపోయినా నిస్సత్తువ ఆవహిస్తుంది. కాబట్టి నీరు ఎక్కువగా తాగాలి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం, తృణ ధాన్యాలతో కూడిన ఆహారాన్ని ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవాలి. అతిగా డైటింగ్‌ చేయడం వల్ల కూడా శరీరంలోని శక్తి హరించుకుపోతుంది. దీంతో నీరసం ఆవహిస్తుంది.
– ఒకేసారి ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం కంటే కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. మహిళలు తీసుకునే ఆహారంలో ఐరన్‌ మోతాదు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. తగినంత నిద్రపోవాలి.
– నిద్రపట్టకపోతే ఎట్టిపరిస్థితుల్లో మాత్రలు తీసుకోకూడదు. ప్రతిరోజూ వ్యాయామం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. శరీరానికి శ్రమ కలిగేట్లుగా ఇంట్లో చిన్న పనులు చేయడం వల్ల కూడా అలసట కలిగి శరీరానికి తగినంత నిద్ర లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news