తెలుగుతో పాటు తమిళ్, కన్నడ్, మళయాళం, హిందీ భాషల్లో దేశవ్యాప్తంగా సైరా నామస్మరణతో థియేటర్లు మార్మోగుతున్నాయి. ఇక సైరాలో చిరు నటనకు ప్రతి ఒక్కరు హ్యాట్సాఫ్ చెపుతున్నారు. సైరా చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందని కూడా మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక సైరాపై రకరాల అభిప్రాయాలు వ్యక్తమవుతోన్న వేళ సైరా ప్లస్‌లు ఏంటి ? సైరాలో మైనస్‌లు ? ఎలా ఉన్నాయో చూద్దాం.
సైరా ప్లస్‌ల విషయానికి వస్తే యాక్షన్ పార్ట్‌లో చిరుచేసిన స్టంట్స్ చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ఎమోషనల్ సీన్స్‌లోనూ అద్భుతంగా నటించాడు. ఇక క్లైమాక్స్‌లో చిరు యాక్టింగ్‌కు ప్రతి ఒక్కరు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఉన్న కాసేపు కూడా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన వచ్చి ప్రతీసీన్‌కు ఇంపార్టెన్స్ ఉండేలా జాగ్రత్త పడ్డారు.
ఇక సామంత రాజులుగా చాలా మంది ఉన్నా వీరందరిలోనూ సుదీప్ చేసిన రోల్ బాగా హైలెట్ అయ్యింది. అవుకు రాజు రోల్ మెప్పించింది.
ఇక సైరా స్వాతంత్య్ర పోరాటం కోసం సాయం చేసేందుకు తమిళనాడు నుంచి ఇక్కడకు వచ్చిన రాజా పాండి పాత్రలో విజయ్ సేతుపతి విజృంభించాడు. సైరా భార్య సిద్ధమ్మ పాత్రలో నయనతార, లక్ష్మీ పాత్రలో తమన్నా, వీరారెడ్డి పాత్రలో జగపతిబాబు ఇలా అందరూ వారి వారి పాత్రలకు తమ నటనతో ప్రాణం పోశారు. ఇక భారీగా ఖర్చు పెట్టిన రామ్ చరణ్‌తో పాటు సినిమాలో ఇంత మంది స్టార్లను బ్యాలెన్స్ చేస్తూ సీన్లు ప్రజెంట్ చేసిన సురేందర్‌రెడ్డి కష్టాన్ని మెచ్చుకోవాలి. ఇక ఇంటెన్స్ ఇంటర్వెల్, యాక్షన్ ఎపిసోడ్స్.. దేశభక్తి సన్నివేశాలు బాగున్నాయి.
ఇక మైనస్‌ల విషయానికి వస్తే సినిమా ఫస్టాఫ్ స్లోగా ఉండటం… కథలోకి వెళ్లేందుకు దర్శకుడు చాలా సమయం తీసుకోవడంతో పాటు అసలు కథను పూర్తిగా చూపించకపోవడం కూడా మైనస్సే. దీనికి తోడు కథను సురేందర్‌రెడ్డి తన ఇష్టానికి తగ్గట్టుగా మార్చేశారు. నిజానికి నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ ఆయన బ్రిటీష్‌వారికి లొంగక ముందే చనిపోతుంది. కానీ సినిమాలో అలా చూపించలేదు. ఆయన బ్రిటీష్ సైనికులను ఊచకోత కోసినట్టు చూపించారు. వాస్తవంగా ఆయన గొరిల్లా యుద్ధం చేశారు.