ఈ తప్పులు చేస్తే మానసిక సమస్యలు ఎక్కువైపోతాయి..!

మానసిక సమస్యలు ఉన్నా లేదు అంటే చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా ఈ తప్పులు చేయొద్దు అని నిపుణులు అంటున్నారు. శారీరక ఆరోగ్యం ఎలా ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మానసిక సమస్యలు ఏమైనా వస్తే ఆలోచించడానికే కుదరదు, సరిగ్గా పని చేసుకోవడానికీ వీలు అవ్వదు.

Making mental health

 

ఇలా వివిధ రకాల సమస్యలు వస్తాయి. అయితే చాలా మంది మానసిక సమస్యలు ఉంటే ఈ తప్పులు చేస్తారు అని నిపుణులు అంటున్నారు. మానసిక ఆరోగ్యం కనుక సరిగా లేదు అంటే తప్పకుండా మానసిక నిపుణులుని కన్సల్ట్ చేయాలని.. దీనితో సమస్యకి పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు నిపుణులు.

అయితే ఒక మనిషి నుండి మరొక మనిషికి సమస్య వేరుగా ఉంటుందని.. ఎక్కువగా ఎంగ్జైటీ, ఒత్తిడి కారణంగా వస్తాయని అంటున్నారు. డిప్రెషన్, శ్రద్ధ తీసుకోలేకపోవడం వంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయని అంటున్నారు. మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ తప్పులు చెయ్యద్దు.

ఒత్తిడిని పెంచద్దు:

ఒత్తిడిని తగ్గితే ఆరోగ్యం బాగుంటుంది. ఆఫీసు, ఇల్లు లేదా ఇతర కారణాల వల్ల ఎక్కువ ఒత్తిడి కలిగితే దానిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.

మానసిక సమస్యలతో బాధపడే వారు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. దీంతో సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కనుక ఈ తప్పులు అస్సలు చేయకండి.

సరైన ఆహారం తీసుకోకపోవడం:

మానసిక సమస్యలతో బాధపడేవారు సరైన ఆహారం తీసుకోరు. ఈ తప్పు అసలు చెయ్యదు. మంచి పోషకాహారం తీసుకుంటే మానసిక అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోండి.

సరైన నిద్ర లేకపోవడం:

మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే నిద్రపోకుండా ఉండటం మంచిది కాదు. కనీసం రోజుకు ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి.

ఇలా ఈ చిన్న చిన్నవి శ్రద్ధగా పట్టించుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు లేదు అంటే సమస్య మరింత ప్రమాదకరంగా మారుతుంది.