బీపీ మొదలు క్యాన్సర్ వరకు స్ట్రాబెర్రీస్ తో ఎన్నో లాభాలు…!

స్ట్రాబెర్రీలు పోషక పదార్థాల తో నిండి ఉంటాయి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఇవి సహాయం చేస్తాయి. కనుక డయాబెటిస్ పేషెంట్స్ వీటిని తీసుకుంటే మంచిది. అయితే స్ట్రాబెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు…?, ఎలాంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం.

 

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 400 గ్రాములు స్ట్రాబెర్రీలను తీసుకుంటే హృదయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే డయాబెటిస్, క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది. విటమిన్ సి కూడా స్ట్రాబెర్రీలో సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే స్ట్రాబెర్రీ తీసుకోవడం వల్ల ఏ సమస్యలు ఉండవు అనే విషయంలోకి వస్తే..

హృదయ ఆరోగ్యానికి మంచిది :

స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల హృదయ ఆరోగ్యానికి మంచిది. ఫైబర్, పొటాషియం ఇందులో సమృద్ధిగా ఉంటుంది. హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది:

స్ట్రాబెర్రీస్ తీసుకోవడం వల్ల స్ట్రోక్ రిస్కు కూడా తగ్గుతుంది. కాబట్టి వీటిని తరచు తీసుకుంటూ ఉండండి.

క్యాన్సర్ సమస్య ఉండదు:

స్ట్రాబెర్రీస్ క్యాన్సర్ ని తగ్గిస్తుంది. అలానే ఇతర సమస్యల బారిన పడకుండా కూడా రక్షిస్తుంది.

డయాబెటిస్ వాళ్లకి మంచిది:

బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచడానికి స్ట్రాబెర్రీలు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు తీసుకుంటే మంచిది.

బీపీ సమస్య తగ్గుతుంది:

హైబీపీ తో బాధపడే వాళ్ళు స్ట్రాబెర్రీలను తీసుకుంటే బీపీ తగ్గుతుంది. అలానే కాన్స్టిపేషన్ సమస్య నుండి కూడా బయటపడవచ్చు.