ముంబైలో విజృంభిస్తున్న మీజిల్స్‌.. నెల రోజుల్లో 13 మంది మృతి..

తమిళనాడును కళ్లకలకలు వణికిస్తుంటే..ముంబై మహా నగరాన్ని..మీజిల్స్‌ వ్యాధి భయపెడుతుంది.. ప్రాణాలను సైతం ఈ వ్యాధి బలితీసుకుంటుంది. చిన్న పిల్లలకు సోకే ఈ అంటువ్యాధితో నెల రోజుల్లోనే 13 మంది చిన్నారులు చనిపోవడం ఇప్పుడు అక్కడ ఆందోళన కలిగిస్తోంది. ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా..మీజిల్స్‌ వ్యాధి ఎక్కువగా ప్రబలుతోంది.
spinal muscular atrophy injection
spinal muscular atrophy injection
ఈ ఏడాది ఇప్పటివరకు 233 మీజిల్స్ కేసులు నమోదు కాగా.. గడిచిన రెండు నెలల్లోనే 200 కేసులను గుర్తించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.. గత కొన్నేళ్లలో ఈ స్థాయి కేసులు ఎప్పుడూ నమోదు కాలేదు. బుధవారం 30 మంది చిన్నారులు మీజిల్స్ వ్యాధితో ఆస్పత్రిలో చేరగా, 22 మంది డిశ్చార్జ్ అయ్యారు. ముంబైతో పాటు సమీపంలోని మాలేగావ్, భివండి, థానే, నాసిక్, అకోలా, కల్యాణ్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.
ఇటీవలి సర్వేలో మరిన్ని అనుమానిత కేసులు బయటపడ్డాయి. ముంబైతోపాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో కూడా మీజిల్స్ కేసులు ప్రబలుతున్నాయి. మీజిల్స్ వ్యాధి విజృంభించడానికి కారణం ఇటీవలి కాలంలో వ్యాక్సినేషన్ సరిగ్గా జరగకపోవడమేనని అధికారలు అంటున్నారు.
కోవిడ్ వల్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించలేదని, దీంతో మీజిల్స్ వ్యాధి పెరుగుతోందంటున్నారు. చిన్నపిల్లల్లో సోకే ఈ వ్యాధిని నియంత్రించడానికి రెండు డోసుల వ్యాక్సిన్ వేస్తుంటారు. 9-15 నెలల మధ్య వయసున్న చిన్నారులకు రెండు డోసులు ఇవ్వాలి..కానీ. ప్రస్తుతం ముంబై పరిధిలో అర్హత కలిగిన వారిలో 41 శాతం మంది చిన్నారులు మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారని అధికారులు చెప్పారు. కనీసం 20,000 మందికిపైగా చిన్నారులు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉందన్నారు.
ఇప్పుడున్న సీజన్‌లో చిన్నారుల ఆరోగ్యం చాలా ముఖ్యం..తమిళనాడులోనూ రోజుకు 4000 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.. అక్కడి వైద్య అధికారులను ఈ వ్యాధి కలవరపెడుతోంది.. దీని వల్ల ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణహాని జరగలేదు కానీ..కేసులు మాత్రం ఆందోళనక స్థాయిలో పెరుగుతున్నాయి.. సూర్యరశ్మి లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. ఏది ఏమైనా..ఈ పరిస్థితుల్లో చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.