వ్యవసాయంలో వేప ఉపయోగాలు.. ఇలా వాడితే తెగుళ్ల సమస్య ఉండదు..!

-

కూరగాయల సాగులో వేప అన్నదాతలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. వేప నుంచే వచ్చే కొమ్మలు, బెరడు, విత్తనాలు, ఆకులు, వేర్లు, పూలు,కాండం ఇలా ప్రతీది వాడుకోవచ్చు. ఏదో వృద్ధాగా పోదు. పల్లెటూర్లలో ఇంటికో వేప చెట్టు ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూడా చాలావరకూ తగ్గాయనుకోండి.. పంటలకు కీటనాశినిగా, విత్తనశుద్దికి, ధాన్యం నిల్వ చేసుకోవడానకి వేపను వాడుకోవచ్చు.. అసలు వేప వల్ల అన్నదాతలకు ఏవిధంగా మేలు జరుగుతుందో చూద్దామా.. కరెక్టుగా ఇంప్లిమెంట్ చేస్తే.. ఇదే మంచి బిజినెస్ అవుతుంది కూడా.

వేప వల్ల వ్యవసాయంలో ఉపయోగాలు :

వేపచెట్టు కాయలను సేకరించి వాటిని కషాయంలా చేసుకుని పంటకు పిచికారీ చేసుకోవచ్చు. వేపపండ్లను నీటిలో నానబెట్టి విత్తనాన్ని వేరు చేసి తర్వాత విత్తనాలను ఆరబెట్టి లోపలి పప్పును వేరు చేసుకోవాలి. ఈ పప్పును బాగా పొడిచేసి నీటిలో 24 గంటలపాటు నానబెట్టాలి. ఈ ద్రావణాన్ని వడపోసి 20 నిమిషాలపాటు బాగా పిండి పొడిని వేరు చేయాలి. 10 కిలోల వేపగింజల పొడిని 200 లీటర్ల నీటిలో నానబెట్టగా వచ్చే ద్రావణాన్ని నీటితో కలిపి పిచికారి చేస్తే కీటకాలు నాశనమౌతాయి.

విత్తనాలను రకరకాల పురుగులు, తెగుళ్ళబారి నుండి కాపాడుకోవాలంటే విత్తనశుద్ధి తప్పనిసరి. వేప పిండిని విత్తనాలకు కలిపి శుద్ధి చేస్తే ఆ విత్తనాలు పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా చాలా కాలం నిల్వ ఉంటాయి. ఒక కిలో విత్తనానికి 10 గ్రా వేపపిండి కలిపి దాన్ని అన్నివిత్తనాలకు అంటుకునేలా శుద్ధి చేస్తే విత్తనాలు ఎక్కువ కాలం నిల్వ ఉండటమే కాక మంచి దిగుబడులు వస్తాయి.

ధాన్యం నిల్వ చేసేసమయంలో కీటకాలు వచ్చి పంటను నాశనం చేస్తాయి..ధాన్యాన్ని నిల్వ ఉంచే ముందు వేప ఆకులు ధాన్యంలో కలుపుకోవాలి. తద్వారా ధాన్యాన్ని ఆశించే కీటకాల బెడద తగ్గుతుంది. ధాన్యం నిల్వ చేసే పంచులను వేపనూనెతో శుద్ధి చేస్తే కీటకాల నుండి కాపాడుకోవచ్చు.

వేపచెక్కలో అమైనో అమ్లాలు , గంధకం ఉంటాయి. దీనిని పశువుల దాణాలో కలపడం వల్ల ఆహారంలో పోషక విలువలు పెరుగుతాయి. తాజా వేపాకులలో మాంసకృత్తులు , ఖనిజాలు ఉంటాయి. వీటిని మేతగా వాడుకోవచ్చు. వేప ద్రావణం నీటిలో కలిపి స్నానం చేయించడం వలన పశువులకు చర్మ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. పశువుల పాకల్లో వేపాకులను, కొమ్మలను కాలిస్తే ఈగలు, దోమలు బెడదను తగ్గించుకోవచ్చు.

ఇలా వేపను వ్యవసాయంలో వాడుకోవటం వల్ల పురుగుమందులు ఖర్చు తగ్గుతుంది. మంచి ఫలితం కూడా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news