యువతలో పెరుగుతన్న ఓరల్ క్యాన్సర్.. 30 ఏళ్లు నిండని వారే అధికం..!

-

తాగకురా చెడతావు అని అందరూ అంటారు.. అసలు పొగతాగడం, గుట్కాలు నమలడం వల్ల క్యాన్సర్ భారిన పడాల్సి వస్తుందని తాగే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ నేడు ఇలా చేయడం ఒక స్టైల్ అయిపోయింది.. రింగులు రింగులుగా పొగ తాగుతూ ఉదితే.. అంచెలంచెలుగా క్యాన్సర్ మనలో డవలప్ అవుతుంది. పొగాకు వల్ల ఏటా మిలయన్ల మంది చనిపోతున్నారు. నోటి క్యాన్సర్ కు ఇది ప్రధాన కారణం అవుతుంది. అయితే 30ఏళ్లు కూడా నిండని వారే క్యాన్సర్ భారిన పడుతున్నారట.

పొగాకు వల్ల ఈ జబ్బులు కూడా…

ఊపిరితిత్తులు, నోటి క్యాన్సరే కాకుండా అనేక ఇతర రకాల క్యాన్సర్లకు ప్రధాన కారణం పొగాకు వాడకం. గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, దృష్టి, వినికిడి సమస్యలు, దంతాలలో సమస్యలు మొదలైన వాటికి పొగాకు వాడకం ప్రధాన కారణమని వైద్యులు అంటున్నారు. పొగాకులో అత్యంత విషపూరితమైన పదార్థాలు ఉంటాయి. క్యాన్సర్ కారకాలు కార్సినోజెన్లు, నికోటిన్ కలిగి ఉంటుంది. నికోటిన్‌ చాలా హానికరం. ధూమపానం 90% ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకు కారణమవుతుంది. అలాగే ఇది నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని 10 రెట్లు పెంచుతుంది.

ఈ క్యాన్సర్స్ భారిన పడక తప్పదు..

పొగాకు నోటి కుహరం, గొంతు, అన్నవాహిక, ఊపిరితిత్తులకు సంబంధించిన కణితుల సమస్యను తీవ్రతరం చేస్తుంది. పొగాకు నమలడం లేదా ప్యాక్ చేసిన ఆకులను పీల్చడం వల్ల కడుపు క్యాన్సర్‌తో పాటు పెదవులు, బుగ్గలు, చిగుళ్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా ఉందట.
నోటి కేన్సర్ నోటి కుహరంలో లేదా నాలుక, కింది పెదవి, చిగుళ్ళు, దవడ లేదా నోటి దిగువ భాగంలో, సోకుతుంది.

స్క్వామస్ సెల్ కార్సినోమా…

స్క్వామస్ సెల్ కార్సినోమా అనేది అత్యంత సాధారణ నోటి క్యాన్సర్. ఇది తరచుగా పురుషుల నోటి దిగువ భాగంలో, నాలుకలో కనిపిస్తుంది. అలాగే ఇది మహిళల నాలుక లేదా చిగుళ్ళలో కూడా వస్తుంది. నోటి క్యాన్సర్ అనేక రకాలుగా ఉంటుంది. చాలా కేసుల్లో 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిలోనే ఈ క్యాన్సర్ కేసులు వెలుగు చూస్తున్నాయి.

యువత స్టైల్ కోసం.. చేసే కొన్ని అలవాట్ల వల్ల.. నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అవును సిగిరెట్ వల్ల తలనొప్పి తగ్గినట్లు అనిపిస్తుంది. స్ట్రస్ కూడా తగ్గుతుంది. తాగినంత సేపు.. ఒక మత్తు ఫీల్ ఉంటుంది. కానీ వీటన్నింటి కంటే.. ఆరోగ్యం చాలా ముఖ్యం కదా..! బాహ్యంగా ఏర్పడిన గాయాలను ఏదో ఒకలా తగ్గించుకోవచ్చు. కానీ లోపల పార్ట్స్ డామేజ్ అయితే.. కొన్ని సార్లు డబ్బు కూడా కాపడలేదు. అందుకే.. పైకి కనిపించే శరీరమే కాదు.. లోపల అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.. అది ఊపిరితిత్తులు అయినా.. మనసైనా..! కోరుకున్నవన్నీ దక్కాలని లేదు.. దక్కనివన్నీ అక్కర్లేనివని కాదు.. కాబట్టి..లైఫ్ లో జరిగే ఘటనలను ప్రాక్టికల్ గా తీసుకుని మూవ్ అవ్వాలే కానీ.. వాటిని తలుచుకుంటూ.. చెడు అలవాట్లకు దగ్గరైతే..ఆరోగ్యవంతమైన జీవితం మన నుంచి దూరమవుతుంది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news