పూదీనా చాయ్ తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే మీరు దాన్ని వదలరు….!

-

పూదీనా చాయ్ కూడా ఉంటదా? అని నోరెళ్లబెట్టకండి. ఈ దునియాలో వేల రకాల చాయ్‌లు ఉన్నాయి. అందులో పూదీనా చాయ్ ఒకటి. కాకపోతే మనకు తెలిసింది రెండు మూడు రకాల చాయ్‌లు మాత్రమే. పూదీనా చాయ్‌ని చేయడం కూడా సులువే. ఈ చాయ్‌ని రోజువారి జీవితంలో అలవాటు చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

పూదీనా చాయ్‌ని ఎలా తయారు చేయాలో తెలుసా? ముందుగా ఫ్రెష్ పూదీనా ఆకులను తీసుకోండి. ఓ గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగించండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఆ నీళ్లలో పూదీనా ఆకులను వేయండి. మూత పెట్టేయండి. కాసేపు నీళ్లు మరిగిన తర్వాత ఆ నీళ్లలో కొన్ని పాలు, ఓ యాలక్కాయ వేయండి. వీలైతే దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. ఇష్టమున్న వాళ్లు తేనె కూడా కలుపుకోవచ్చు. వీటన్నింటినీ వేసిన తర్వాత ఇంకాసేపు ఆ మిశ్రమాన్ని మరిగించండి. అంతే.. వేడి వేడి పూదీనా చాయ్ రెడీ.

పూదీనా చాయ్‌ని రోజూ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ ఉదయాన్నే ఓ కప్పు పూదీనా చాయ్ తాగితే మైండ్ రియాక్టివేట్ అయి.. ఆరోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండొచ్చు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. దీంతో డిప్రెషన్, ఒత్తిడి దూరమవుతాయి. దగ్గు, జలుబు, ఫ్లూ లాంటి వైరస్‌లు సోకకుండా పూదీనా చాయ్ కాపాడుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడటంతో పాటు మలబద్ధకం సమస్య కూడా తొలిగిపోతుంది. పూదీనాలో ఉండే విటమిన్ ఏ, సీలు శరీరంలో ఇన్‌ఫెక్షన్లు రాకుండా నిరోధిస్తాయి. గర్భిణీలు కూడా ఈ చాయ్‌ని నిరభ్యంతరంగా తాగొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news