ఎక్కువసేపు కూర్చుంటున్నారా…? అయితే ఈ సమస్యలు తప్పవు…!

చాలా మంది ఎక్కువ సేపు కదలకుండా ఒకే దగ్గర కూర్చుండిపోతారు. కానీ అలా చెయ్యకూడదు. అలా కనుక చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి అని హెచ్చరిస్తున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ ఎం.డి. అండర్సన్‌ కేన్సర్‌ సెంటర్‌కు చెందిన నిపుణులు. మరి పూర్తి వివరాల్లోకి వెళితే… ఎక్కువ సేపు కదలకుండా ఒకే దగ్గర కూర్చుంటే కేన్సర్‌ బారిన పడే అవకాశాలు ఉన్నాయి అని వెల్లడించారు.

చురుకుదనం ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా కేన్సర్‌ బారిన పడాల్సి ఉంటుందని అంటున్నారు. ఎక్కువ సేపు కూర్చునే వాళ్లలో 82శాతం మంది కేన్సర్‌ బారిన పడుతున్నట్లు తేలింది అని చెప్పడం జరిగింది. ఈ పరిశోధన లో నలభై ఐదేళ్లు దాటిన ముప్ఫై వేల మందిని తీసుకుని వీళ్ళ మీద ఐదేళ్ల పాటు రీసెర్చ్ చేయడం జరిగింది. అందులో కొందరికి కూర్చునే సమయంలో అరగంట తగ్గించి, ఆ సమయంలో వ్యాయామం చేయించారట.

అదే సైక్లింగ్‌ చేసిన వాళ్ళకి ప్రమాదం 31శాతం, నడక అయితే 8 శాతం తగ్గినట్టు గుర్తించారు. కదలకుండా కూర్చునే మూడు వందల మంది మరో ఐదేళ్ల తర్వాత కేన్సర్‌ తో మరణించారట. కనుక ప్రతీ గంటకి లేవడం, నడవడం చెయ్యాలి. మరీ సమయం ఉంటె సైక్లింగ్ కూడా చెయ్యడం మంచిది. కాబట్టి ఎక్కువగా కూర్చునే వాళ్ళు వీటిని గమనించి శ్రద్ధ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.