జానారెడ్డి పోటీకి సై అనడం వెనుక అసలు ప్యూహం ఇదేనా

-

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి ని ఏఐసీసీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల అభ్యర్థిగా ప్రకటించింది. దీన్ని కారణంగా చూపిస్తూనే పీసీసీ నియామకాన్ని వాయిదా వేసింది పార్టీ. కారణం రాజకీయ వ్యూహం..ఏదైనా..మొత్తనికి నాగార్జున సాగర్ ఎన్నికల్ని పావుగా చూపిస్తూ పీసీసీ ని వాయిదా వేశారు. దింట్లో జానారెడ్డి జోక్యం కూడా తోడవడంతో బలం చేకూరింది. అంత బాగానే ఉన్నా…తాను ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న జానారెడ్డి పోటీకి సై అనడం వెనుక ఉన్న ప్యూహం పై ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి మొదటి నుండి కూడా జానారెడ్డి అంత ఆసక్తి కనపరచలేదు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్ని అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంత సవాల్ గా తీసుకుందో ఆయనకు తెలుసు. అధికార పార్టీ ఆర్థిక బలం ముందు మనం నిలవగలుగుతామా..ఉప ఎన్నికల్లో పోటీ చేసి… మళ్ళీ ఏడాదిన్నర కాగానే తిరిగి సాధారణ ఎన్నికలు వస్తే దానికి కూడా మళ్లీ బరిలో నిలవాలంటే ఆర్థిక ఇబ్బందుల్లో పడతామనే టెన్షన్ ఉండేది జానారెడ్డి కి. అందుకే ఉప ఎన్నికల మీద అంత ఆసక్తి కనపరచలేదు.

కానీ పార్టీలో జరిగిన మార్పులలో ఆఖరికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి ఠాగూర్..జానారెడ్డి బరిలో ఉంటారని ప్రకటన చేశారు. మొదటి నుండి బరిలో ఉండను అని చెప్పిన జానారెడ్డి ఇప్పుడు అభ్యర్ది కావడం అంటే..పీసీసీ వాయిదా వేయాలని కోరిన జానారెడ్డిని మిరే అభ్యర్ది అయితే మేడంకి సమాచారం ఇస్తామన్నారా..లేదంటే మారుతున్న పరిణామాలలో పార్టీ పీసీసీ పదవి ఆశిస్తున్నా నాయకుడే చక్రం తిప్పారా..అనే టాక్ మొదలైంది. జానారెడ్డి ఈ వ్యవహారంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారా..లేదంటే పీసీసీ ఆపాలని చేసిన వ్యూహంలో జానారెడ్డి ఫిక్స్ అయ్యారా అనే టాక్ మొదలైంది.

పీసీసీ నియామకం ఆగిందనే కానీ..నాగార్జున సాగర్ లో జానారెడ్డి బరిలో ఉంటేనే పార్టీకి బలం. లేదంటే అసలుకే మోసం జరిగేది అనే టాక్ కూడా ఉంది. పార్టీ చేసిన సర్వే లో కూడా జానారెడ్డి బరిలో ఉంటేనే అక్కడ కాంగ్రెస్ కి లైఫ్ అనే నివేదిక వచ్చిందట. ఏదైనా జనారెడ్డే సాగర్ లో కాంగ్రెస్ కి బలం అని తేలింది..

Read more RELATED
Recommended to you

Latest news