చిన్నపిల్లలకు అతిగా చెమటలు పడుతున్నాయా..గుండె గండంలో ఉన్నట్లే..!

సాధారణంగా చెమట పడితే మంచిదే అంటారు. కానీ అతిగా చెమట పడితే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. బాడీ లోపల టాక్సిన్స్‌ ఎక్కువైతేనే అలా జరుగుతుంది. పెద్దవాళ్లకంటే. చిన్నపిల్లల్లో చెమటపడితే అది ఇంకా ప్రమాదం. గుండె జబ్బులను గుర్తించడం చాలా కష్టం. పెద్దవాళ్లే ఏ విషయం సరిగ్గా చెప్పలేరు. అలాంటిది చిన్నపిల్లల్లో అయితే ఇంకా కష్టం. కొంతమంది పిల్లలకి పుట్టుకతోనే గుండె జబ్బులు వస్తాయి. వాటిని వైద్యులు వెంటనే గుర్తించి తగిన చికిత్స చెయాలి.

పిల్లల్లో గుండె జబ్బులు గుర్తించడం ఎలా?

పుట్టే ప్రతి బిడ్డకి గుండె సంబంధిత పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. గర్భం దాల్చిన దగ్గర నుంచి తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ తగిన చికిత్స తీసుకుంటూ ఉండాలి. పిల్లల్లో ఏదైనా గుండె జబ్బు ఉన్నట్టు అనుమానం ఉంటే వెంటనే పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ దగ్గరకి రిఫర్ చేస్తారు. గుండె లోపాన్ని నిర్ధారించేందుకు వైద్యులు ఎకోకార్డియోగ్రామ్ చేస్తారు. పుట్టుకతో వచ్చేవే ఎక్కువగా ఉంటాయి. క్లిష్టమైన గుండె లోపాల్ని వైద్యులు శిశువు పుట్టిన కొద్ది గంటల్లోనే శస్త్రచికిత్స చేయవచ్చు.

గుండె జబ్బు సంకేతాలు..

పిల్లలు సరిగా ఆహారం తీసుకోకపోవడం, తినేటప్పుడు అలిసిపోవడం, బరువు పెరగడం, అతిగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల ప్రమాదానికి సంకేతాలుగా గుర్తించాలి.

శిశువు ఏడుస్తున్నప్పుడు పెదవులు, నాలుక, గోర్లు నీలం రంగులోకి మారిపోతాయి.

పెద్ద వయసు వచ్చే సరికి న్యుమోనియా, అలసి పోవడం, శ్వాస ఆడకపోవడం వంటివి జరుగుతాయి.

పుట్టుకతో గుండె జబ్బులు వచ్చే కేసులు చాలా తక్కువగా ఉంటాయని కార్డియాలజిస్ట్ చెప్పుకొచ్చారు.

వెయ్యి మందిలో 8-10 మంది పిల్లలకి మాత్రమే అటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందని అన్నారు.

కేవలం 1% మాత్రమే పుట్టుకతో గుండె జబ్బులతో బాధపడుతున్నారు.

ఎలాంటి ఆహారం ఇవ్వాలి?

పిల్లలకి తగిన పోషకాలు అందె విధంగా ఆహారం అందించాలి. వాళ్ళకి స్థిరమైన వ్యాయామం అంటూ ఏది లేదు. రోజుకు కనీసం 1-2 రెండు గంటల పాటు బహిరంగ వాతావరణంలో ఆడుకుంటే సరిపోతుంది. గుండె జబ్బులు ఉన్న పిల్లలు త్వరగా అలిసిపోతారు.

ఇక ఆహారం విషయానికి వస్తే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, లీన్ ప్రొటీన్లు, గింజలు, చిక్కుళ్ళు, కూరగాయల ఆధారిత నూనెలతో సహా వివిధ రకాల ఆహారాలు ఇవ్వాలి. డోనట్స్, పంచదార, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహరం, సోడియం ఎక్కువ ఉన్న పదార్థాలు మితంగా తీసుకోవాలి. గుండె జబ్బు ఉన్న పిల్లల జీవక్రియ వేగంగా ఉంటుంది. అందుకే వాళ్ళు కేలరీలను త్వరగా బర్న్ చేసుకోగలుగుతారు. అందువల్ల అధిక కేలరీలు ఉండే ఆహారాన్ని అందించాలి.

పాలు లేదా పాల ఉత్పత్తులు, మాంసం, పప్పులు, మొలకలు, గింజలు వంటి అధిక ప్రోటీన్ ఆహారాలు చేర్చాలి. పెద్ద పిల్లలకు ఉప్పు, వేయించిన, తీపి, జంక్ ఫుడ్‌లను నివారించడం మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే చేపలు, ఆవిశే గింజలు, వాల్ నట్స్, కనోలా, సోయా బీన్స్, ఆకుకూరలు క్రమం తప్పకుండా పెట్టాలి.