చలికాలంలో జలుబు, జ్వరం రాకుండా ఉండాలంటే వీటికి దూరంగా వుండండి..!

-

చలికాలంలో జలుబు, జ్వరం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వాళ్లలో త్వరగా జలుబు, జ్వరం వంటివి వస్తుంటాయి. అందుకని ఆరోగ్యంగా ఉండాలంటే చలికాలంలో జాగ్రత్తగా ఉండాలి.

ముఖ్యంగా తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. మీకు తరచూ జలుబు, జ్వరం లాంటివి వస్తూ ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సూప్, అల్లం, తేనే, విటమిన్-సి, స్పైసీ ఫుడ్స్ లాంటివి జలుబు జ్వరం ఉన్నప్పుడు తీసుకుంటే మంచిది. కానీ వీటిని తీసుకోవడం అస్సలు మంచిది కాదు. అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవద్దు:

నిమ్మ, ద్రాక్ష, ఆరెంజ్ వంటివి చలికాలంలో తీసుకోవద్దు. జ్వరం, జలుబు ఉన్న వాళ్లకి ఇవి మంచివి కావు.

పాలు కి దూరంగా ఉండండి:

పాలు మరియు పాల పదార్థాలు ఇబ్బందుల్ని తీసుకొస్తాయి. రెస్పిరేటరీ సిస్టమ్, ఊపిరితిత్తులు మరియు గొంతు సమస్యలకు దారి తీస్తాయి.

బిస్కెట్ వంటివి తీసుకోకండి:

జ్వరం మరియు జలుబు ఉన్నప్పుడు బేకరీ ఫుడ్స్ వంటివి తీసుకోవద్దు వీటి వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి.

ఫ్రైడ్ ఫుడ్స్:

ఫ్రెంచ్ ఫ్రైస్ మొదలైన జంక్ ఫుడ్ ను తీసుకోవడం కూడా అస్సలు మంచిది కాదు. వీటి కారణంగా సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. చలికాలంలో జలుబు జ్వరం లాంటి సమస్యలు ఉంటే వీటికి దూరంగా ఉండండి. లేదు అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news