ఈ పురాతన పద్ధతులతో మరెంత ఆరోగ్యంగా వుండండి..!

-

పురాతన పద్ధతులు పాతవైపోయాయి కానీ నిజంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకేనేమో మన పూర్వీకులు అంత ఆరోగ్యంగా ఉండేవారు. అయితే ఈ రోజు డైటీషియన్ కొన్ని ఆరోగ్యకరమైన సూత్రాలను చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే నిజంగా మనం ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే వినడానికి కొత్త కాదు కానీ మనమే పాటించడం మానేసాము. మరి ఇక ఆ పద్ధతుల గురించి, ఎలా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి అనే దాని గురించి చూసేద్దాం.

 

ayurvedic medicine

ఇప్పుడంటే మిక్సీలు అవి వచ్చాయి. కానీ పూర్వం గ్రైండర్లు, మిక్సీలు కి బదులుగా రోలు వాడేవారు. అయితే చట్నీ వంటివి ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు మిక్సీ కి బదులు రోలుని వాడమని డైటీషియన్ అంటున్నారు. ఇది ఆరోగ్యం పైగా మంచి రుచిని కూడా ఇస్తుంది.

అలానే ఫ్రిజ్ లో నీళ్ళు పెట్టుకుని తాగే బదులు మట్టి కుండలో నీళ్లు తాగితే చల్లగా ఉంటాయి పైగా ఆరోగ్యం కూడా.
అలానే ఎసిడిటీ సమస్య వచ్చిందంటే టాబ్లెట్లు మీద ఆధారపడకండి. ప్రతి చిన్న దానికి టాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఆరోగ్యం మరింత పాడవుతుంది. అందుకని పూర్వికులు పాటించే పద్ధతులు పాటిస్తే సరిపోతుంది. ఎసిడిటీ వచ్చినప్పుడు వాము, నిమ్మ, రాక్ సాల్ట్ వేసుకుని తీసుకుంటే ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.

అదే విధంగా పీరియడ్స్ రెగ్యులర్ గా రానప్పుడు నెయ్యి, బెల్లం, నువ్వులు, జీలకర్ర, అల్లం పొడి కలిపి ఉండలు చేసుకుని తీసుకుంటే పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి.

అలాగే ముఖం అందంగా ఉండాలంటే కెమికల్స్ కి బదులుగా మీగడ లేదా వెన్నను రాసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news