మీ జీవితంలో మీకు తోడు కావాలని తెలిపే కొన్ని సంకేతాలు..

-

ప్రస్తుతం పెళ్ళి మీద ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంది. కొందరు పెళ్ళి వేస్ట్ అంటారు. మరికొందరేమో జీవితంలో ఒక తోడుండాలని చెబుతారు. ఎవరెన్ని చెప్పినా మీకు జీవిత భాగస్వామి అవసరం ఉందా లేదా అనేది మీరే తెలుసుకోవాల్సి ఉంటుంది. జీవిత ప్రయాణంలో నాతో పాటు ఒకరు ఉంటే బాగుంటుందా లేదా ఒక్కడినే జీవితంలో ప్రయాణిస్తే బాగుంటుందా అనేది కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు.

relationship
relationship

ప్రస్తుతం మీ జీవిత ప్రయాణంలో మీకో తోడు కావాలని తెలిపే కొన్ని సంకేతాలను తెలుసుకుందాం.

రొటీన్

ఆఫీసు వెళ్ళామా.. ఇంటికి వచ్చామా.. వండుకున్నామా.. తిన్నామా అన్న చందంగా జీవితం ఉన్నప్పుడు తమతో ఎవరో ఒకరు తోడుగా ఉండాలని అనిపిస్తుంటుంది. ఇక్కడ పనుల్లో భాగం పంచుకోవడమనే ఉద్దేశ్యమే కాదు, పనిలో ప్రేరణ ఇవ్వడం కూడా ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు. చాలామందికి ఇలాంటి ప్రేరణ దొరక్కే ఎంతో తెలివి ఉన్నా అక్కడే ఉండిపోతారు.

ఆనందం హాఫ్ అయినపుడు

ఆనందాన్ని మరొకరితో పంచుకుంటే ఇంకా పెరుగుతుంది. అది అపోజిట్ సెక్స్ తో అయితే మరింత పెరుగుతుంది. పెద్ద పెద్ద విషయాలు కూడా మీకు ఆనందం ఇవ్వలేకపోతున్నాయంటే మీరు జీవితంలో ఒక తోడు కావాలని అర్థం. ఎందుకంటే ఎంత సాధించినా ఎవరికోసం అన్న ఆలోచన మీకు వచ్చినప్పుడు మాత్రమే ఆనందంగా ఉండలేరు.

ఫ్రెండ్స్ తగ్గుతున్నప్పుడు

ప్రస్తుతం స్నేహానికున్న నిర్వచనం కూడా మారిపోయింది. అవసరం ఉన్నప్పుడే స్నేహం గుర్తొస్తూ ఉంటుంది. మీ స్నేహితులందరూ మీకు దూరమైనపుడు మీతో పాటు ఒకరుండాలని మీకు ఆలోచన వస్తుంది. ఉంటే బావుండన్న భావన కలుగుతుంది.

సెక్స్

అఫ్ కోర్స్.. సెక్స్ అనేది మనిషికి చాలా అవసరం. అది ప్రకృతి సిద్ధమైనది. ఆలోచనలు నియంత్రించుకోవడం కరెక్ట్ కాదు. అలా అని కేవలం సెక్స్ కోసమే పెళ్ళి చేసుకోవాలన్న ఉద్దేశ్యమూ లేదు. కానీ, మీ జీవితం మరింత పెరగాలని, నాకో కుటుంబం ఏర్పడాలన్న ఆలోచన మీకు వచ్చినపుడు మీరు మీ జీవితంలోకి తోడుని ఆహ్వానించాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news