సూర్య నమస్కారాలు చేయడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలను మనం పొందొచ్చు రెగ్యులర్ గా సూర్య నమస్కారాలు చేస్తే ఈ బెనిఫిట్స్ ని పొందడానికి అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సూర్యోదయ సమయం లో 10 నుండి 15 నిమిషాలు సూర్య నమస్కారాలు చేస్తే బరువు తగ్గొచ్చు. కండరాలు కీళ్లను బలపరుస్తుంది. నిద్రలేమి సమస్య ఉండదు. మరి సూర్య నమస్కారాలను వేస్తె ఎటువంటి లాభాలను పొందొచ్చు అనేది చూద్దాం.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది:
రోజు సూర్య నమస్కారాలు చేయడం వలన జీర్ణ వ్యవస్థ పని తీరు బాగుంటుంది పేగులలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. కడుపులో చిక్కుకున్న గ్యాస్ సులువుగా బయటికి వస్తుంది ఇబ్బందులు కూడా ఉండవు.
పీసీఓస్ తగ్గుతుంది:
సూర్య నమస్కారాలను చేస్తే పీసీఓఎస్ సమస్యలు కూడా తగ్గుతాయి పీసీఓస్ తో బాధపడే మహిళలు క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేస్తే బాగుంటుంది.
ఒత్తిడి తగ్గుతుంది:
సూర్య నమస్కారాలు చేస్తే ఒత్తిడి కూడా తగ్గుతుంది.
అందమైన చర్మం:
సూర్య నమస్కారాలు చేయడం వలన చర్మం కూడా బాగుంటుంది అలానే జుట్టు కూడా పెరుగుతుంది. అయితే సూర్య నమస్కారాలు గర్భిణీలు 3వ నెల తర్వాత చేయకూడదు గుండె జబ్బులు పేగుల్లో క్షయ వంటి సమస్యలు హైపర్ టెన్షన్ ఉంటే కూడా సూర్య నమస్కారాలు వేయకూడదు. వెన్నునొప్పి, మెడ నొప్పి ఉన్నవాళ్లు సూర్య నమస్కారాలు చేసే ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది.