జుట్టు సమస్యలు ఉంటే దాన్ని అలానే వదిలేయకూడదు. వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలి. సమస్యను నివారించడానికి ఇంట్లో దొరికే కూరగాయలే జుట్టుకు పోషణ అందిస్తుంది. ఇవి జుట్టుకు మాత్రమే కాదు ఆరోగ్యానికి దోహదపడుతుంది. మరి ఆ కూరగాయలేంటో చూద్దాం.
ఆకుకూరలు : ఇందులో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఎ, సి, డిలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జట్టును స్ట్రాంగ్‌గా పెరగడానికి సహాయపడటమే కాదు అందుకు అవసరమైన తలలోని చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
బీట్‌రూట్ : దీన్ని సరైనా మార్గంలో ఉపయోగించినట్లయితే ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ జుట్టు పెరగడానికి కచ్ఛితంగా సహాయపడుతాయి. బీట్‌రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు జుట్టుకు అత్యవసరమయ్యే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి జుట్టు ఆరోగ్యంగా స్ట్రాంగ్‌గా పెరగడానికి సహాయపడుతుంది.
గుమ్మడి : దీంట్లో యాంటీఆక్సిడెంట్స్ పిలవబడే ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్ సి, ఇ లు జట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో గొప్పగా సహాయపడుతాయి. విటమిన్ ఇ తలలో ఫ్రీరాడికల్ డ్యామేజ్‌ను నివారించి తలలో రక్తప్రసరనను మెరుగ్గా ఉంచి జుట్టు స్ట్రాంగ్‌గా, పొడవుగా పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది.
ఉల్లిగడ్డ : జుట్టుకు సరైన పోషణ అందివ్వడానికి ఉల్లిగడ్డ చక్కని మార్గం. ఎందుకంటే ఇందులో జుట్టు పెరుగుదలకు కావాల్సిన జింక్, సల్ఫర్, ఐరన్ వంటి ప్రత్యేకమైన పోషకాలు ఉంటాయి. ఇవన్నీ తలలో కొల్లాజెన్ ఉత్పత్తిని, రక్తప్రసరణను పెంచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
టమాటా : దీనిలో విటమిన్ సి ఉంటుంది. ఇది బలమైన యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉండి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో తలలో మలినాలు, మురికి తొలుగుతుంది.
ఆలూగడ్డ : స్వీట్ పొటాటో బీటా కెరోటిన్‌కి గొప్ప మూలం. జుట్టు ఆరోగ్యానికి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి బాగా హెల్ప్ అవుతుంది. వీటితోపాటు విటమిన్ సి, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి జట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
క్యారెట్ : దీనిలో విటిమన్ ఎ, సి, బి7 సంవృద్దిగా ఉంటాయి. ఇవి తలలో సెబమ్ ప్రొడక్షన్‌ను క్రమబద్ధం చేయడానికి, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి. వీటితో పాటు కరివేపాకు, కీరదోస, వెల్లుల్లి కూడా జుట్టుకు పోషణను అందిస్తాయి.