వేసవి వేడిని తట్టుకుని శరీరాన్ని చల్లబర్చుకోవాలంటే కావాల్సిన ఆహారాలు..

-

ఎండాకాలం వచ్చిందంటే చాలు మనలో ఉన్న శక్తినంతా ఎవరో తీసేసినట్టే అనిపిస్తుంది. ఇక బయటకి వెళ్తే అంతే సంగతి. ఏదో యాడ్ లో చూపించినట్టు సూర్యుడు స్ట్రా వేసుకుని మరీ మన ఎనర్జీని లాగేసుకుంటున్నాడా అన్నట్లు అయిపోతుంది. ఇంటికొచ్చాక పక్క మీద చేరితే కానీ పరిస్థితి చక్కబడదు. ఎండాకాలంలో వచ్చే చాలా సమస్యల్లో శరీరంలో నీరు తగ్గిపోవడమే ప్రధానమైనది. దీనిపట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసం కొన్ని ప్రత్యేకమైన ఆహారాలని తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టమాట

టమాటల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే లైకోపీన్ పదార్థం ఉంటుంది కాబట్టి చర్మానికి చాలా మేలు కలుగుతుంది. సలాడ్, మజ్జిగ, సాండ్విచ్ లాంటి పదార్థాల్లో దీన్ని భాగంగా చేసుకుని తీసుకుంటే చాలు.

పుచ్చకాయ

పుచ్చకాయలో నీటిశాతం చాలా ఎక్కువ. అదీగాక లైకోపీన్ ఉంటుంది కాబట్టి సూర్యుడి నుండి వచ్చే ఎండని తట్టుకోగలరు. ఇందులో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. చర్మ సౌందర్యం బాగుండాలంటే పుచ్చకాయని ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది.

గుమ్మడికాయ

గుమ్మడికాయలో 94శాతం నీరే ఉంటుంది. విటమిన్ సి అధికంగా ఉండడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల చర్మ, కంటి సంరక్షణకి బాగా ఉపయోగపడుతుంది. పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

నారింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. సి విటమిన్ కలిగి ఉన్న సిట్రస్ ఫలాలు చాలా మేలు చేస్తాయి. ఆకు కూరలైన పాలకూర, తోటకూర మొదలగు వాటిని తీసుకోవడం ఉత్తమం. యాంటీఆక్సిడెంట్లు అధికంగా గల బెర్రీస్ ని ఆహారంలో భాగం చేసుకోండి. చిక్కటి పాలు కాకుండా పలుచని పాలు తీసుకుంటే బెటర్. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే వేసవిలో కలిగే వేడి నుండి ఉపశమనం పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news