శానిటరీ ప్యాడ్స్‌తో క్యాన్సర్‌ ముప్పు.. పిల్లలు పుట్టే అవకాశం కూడా…

పూర్వకాలంలో పిరయడ్స్‌ వచ్చినప్పుడు మహిళలు క్లాత్స్‌ వాడేవారు.. కానీ ఇప్పుడు ఎవ్వరూ ఆ పని చేయడం లేదు. మారు మూల పల్లెటూళ్లో వాళ్లు కూడా శానిటరిప్యాడ్స్‌ వాడుతున్నారు. వీటిల్లో బోలెడు రకాలు.. బడ్జెట్‌లో ఉండేవి తెచ్చుకుని వాడుతుంటారు.. కానీ యావత్‌ మహిళా లోకం..శానిటర్‌ప్యాడ్స్‌నే ఎక్కువగా వాడుతున్న ఈ రోజుల్లో..వీటిపై ఒక ఆందోళన కలిగించే విషయం బయటపడింది.

తాజా అధ్యయనం ప్రకారం.. శానిటరీ ప్యాడ్‌ల వాడకం వల్ల పర్యవరణానికే కాదు మహిళల ఆరోగ్యానికీ కూడా చాలా హాని ఉందని తేలింది. ఓ ఎన్జీవో నిర్వహించిన పరిశోధనల్లో ఈ షాకింగ్ విషయం బయటపడింది. శానిటరీ ప్యాడ్‌లో ఉన్న కొన్ని రసాయనాలు మహిళల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నట్టు తేలిందట.. వీటిని దీర్ఘకాలంగా వాడే మహిళల్లో క్యాన్సర్, పిల్లలు కలగక పోవడం వంటి సమస్యలు వస్తాయని బయటపడింది. ఈ శానిటరీ ప్యాడ్‌ల ఉత్పత్తిలో క్యాన్సర్ కారకాలు, హానికర టాక్సిన్లు, అలెర్జీలు కలిగించే ఉత్పత్తులు ఉన్నట్టు అధ్యయనంలో పేర్కొన్నారు.

మనదేశంలో దొరికే పది సంస్థలకు చెందిన శానిటరీ ప్యాడ్ బ్రాండ్‌లపై ఈ పరిశోధన నిర్వహించారు. వీటన్నింటిలో థాలేట్స్, అస్థిర కర్బన సమ్మేళనాలు ఉన్నట్టు అధ్యయనకర్తలు కనుగొన్నారు. ఈ రెండూ కూడా మహిళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తీవ్రంగా పెంచుతాయి. రుతుస్రావం సమయంలో ఈ ప్యాడ్స్ స్రీ జననాంగాలకు అతుక్కుని ఉంటుంది. ఆ సమయంలో ఈ విష రసాయనాలు శరీరంలో చేరే అవకాశం ఉందట..

భారతదేశంలో యుక్తవయస్సులో ఉన్న అమ్మాయిలో 64 శాతం మంది శానిటరీ ప్యాడ్స్‌నే వాడుతున్నారు. కాబట్టి ఈ ప్యాడ్‌లను రసాయన రహితంగా తయారుచేయాలని సూచిస్తున్నారు అధ్యయనకర్తలు.అలాగని పాతకాలంనాటిలా వస్త్రాలను వాడడం కూడా ప్రమాదకరమే. ఎందుకంటే వాటిని శుభ్రంగా క్లీన్ చేసి వాడకపోతే మరిన్ని అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు..అవి ఈ కాలం అమ్మాయిలు అసలే వాడలేరు. శానిటరి ప్యాడ్స్‌లో బాగా స్మెల్ వచ్చేవి ఎంచుకోకపోవడం ఉత్తమం.. ఎందుకంటే..అవి స్మెల్‌ రావడానికి ఏదోఒక రసాయనం కలుపుతారు..ఇంకోటి..ఇప్పుడు మార్కెట్‌లో మెన్సుట్రువల్‌ కప్స్‌ వచ్చాయి.. వీటిని వాడటం వల్ల అటు పర్యావరణానికి ఇటు ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు కానీ..మొదట్లో కాస్త కష్టంగా అనిపిస్తుంది అంతే.. వీటిని వాడే మహిళలకు కూడా ఉన్నారు.. ఒకసారి నెట్‌లో ఈ కప్స్‌పై సర్చ్‌ చేయండి మీకే అవగాహన వస్తుంది.