ఆధునిక జీవనశైలిలో మన శరీరం ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై, భౌతిక సుఖాల వెంట పరిగెడుతూ ఆత్మ శాంతిని పూర్తిగా మర్చిపోతున్నాం. నిజమైన ఆనందం,శాంతి శరీరానికి కాదు ఆత్మకు బలాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక మార్గం వైపు నడవడంలో వస్తుంది. ఆధ్యాత్మికత అంటే ఏంటి మనం ఆత్మబలాన్ని పెంపొందించుకోవడానికి ఆధ్యాత్మిక మార్గాలను ఎలా అన్వేషించాలి? దాని వల్ల వచ్చే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆధ్యాత్మికత అంటే : ఆధ్యాత్మికత అంటే కేవలం ధార్మిక కార్యక్రమాలు పూజలు చేయడం మాత్రమే కాదు ఇది మనలోని ఆత్మను అంటే నిజమైన స్వరూపాన్ని గుర్తించి, దైవంతో లేదా విశ్వశక్తితో సంబంధాన్ని మనం ఏర్పరచుకోవడం ఆధ్యాత్మికత మన జీవితంలోని శాంతిని సమతుల్యతల్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఇది మన బాహ్య సుఖాల నుండి విముక్తి చేసి అంతర్గత ఆనందం వైపు నడిపిస్తుంది.
ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక మార్గాలు : ఆధ్యాత్మికతను అనుసరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలు మనిషి యొక్క ఆచారాలు విశ్వాసాలు సంస్కృతి పై ఆధారపడి ఉంటాయి.
ధ్యానం: ఆధ్యాత్మిక మార్గం వైపు నడవడానికి మొదట మనకి అనువైన సాధనం ధ్యానం. మనసును శాంతపరిచి ఆత్మతో సంబంధాన్ని బలపరుస్తుంది. ఇది ఒత్తిడి ఆందోళనను తగ్గించి అంతరంగిక శాంతిని అందిస్తుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 10 నుండి 15 నిమిషాలు నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చుని శ్వాస పై దృష్టి పెట్టి ఓం అనే మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేయవచ్చు.
జ్ఞానమార్గం : అసలు జ్ఞానమార్గం అంటే ఏమిటి? నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతకడమే జ్ఞానం మార్గం. ఇది ఆత్మను అర్థం చేసుకోవడం పై ఆధారపడుతుంది. హిందూ సాంప్రదాయంలో భగవద్గీత, ఉపనిషత్తులు రమణ మహర్షి లాంటి ఆధ్యాత్మిక గురువుల బోధనలను చదవడం వలన, గురువుల సన్నిధిలో వారితో సత్సంగాలలో పాల్గొనడం వలన ఆత్మ విచారణ ఎలా చేయాలనేది తెలుస్తుంది.
భక్తి మార్గం : దైవభక్తి దేవుడిపై పూర్తి విశ్వాసం, భక్తితో ఆత్మను శుద్ధి చేసుకోవడం. నిత్యం పూజలు చేయడం స్తోత్రాలు పటించడం, భజనలు చేయడం, దేవాలయాలను సందర్శించడం. ఇలాంటి భక్తి మార్గాలను ఎంచుకోవడం వలన ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొంది, ఆనందం మన సొంతమవుతుంది.
యోగమార్గం : శరీరం మనసు ఆత్మను సమన్వయం చేసే ఒకే ఒక ప్రక్రియ వ్యాయామం. ఇది శ్వాస పద్ధతుల సమాహారం. ప్రతిరోజు కొంత సమయం కేటాయించుకొని యోగాసనాలు వేయడం ప్రాణాయామం చేయడం వలన శరీర ఆరోగ్యంతో పాటు ఆత్మశక్తి కూడా పెరుగుతుంది.
ఆధ్యాత్మిక మార్గం శరీర సుఖాలను పొందించిన ఆత్మ శాంతిని బలాన్ని అందిస్తుంది. ధ్యానం, జ్ఞానం, భక్తి, కర్మ యోగ మార్గాల ద్వారా ఈ శాంతిని పొందవచ్చు రోజువారి జీవితంలో చిన్న చిన్న ఆధ్యాత్మిక పనులను నేర్చుకోవడం ద్వారా మనం సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. తెలుగు సాంస్కృతిలో ఆధ్యాత్మిక ఆచారాలు ఈ మార్గంలో మనకు మార్గదర్శకాలుగా నిలిచాయి. ఈ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించి ఆత్మకు నిజమైన బలాన్ని అందించండి.