అల్పాహారం తినకపోతే ఈ సమస్యలు వస్తాయి..!

-

మన పెద్దలు చెప్పటం మనం వినే ఉంటాం అల్పాహారం ఎక్కువ తీసుకోవాలి.. మధ్యాహ్నం మరింత తక్కువ తీసుకోవాలి.. అదే విధంగా రాత్రి డిన్నర్ బాగా తక్కువ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. నిజంగా అల్పాహారం చాలా ముఖ్యమైనది. అందుకే అల్పాహారాన్ని ఎక్కువ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఏ పూట తిన్నా తినకపోయినా అల్పాహారం తప్పకుండా తినాలి. అయితే చాలామంది అల్పాహారాన్ని స్కిప్ చేస్తారు.

 

సమయం లేకనో, తినాలని అనిపించకో ఇలా వివిధ కారణాల వల్ల బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయడం జరుగుతుంది. అయితే బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం వల్ల అనర్థాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మరి అల్పాహారం తినకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి దాని కోసం కూడా పూర్తిగా చూసేయండి.

ఉదయం పూట టిఫిన్ తినే వాళ్ళ తో పోల్చుకుంటే మానేసే వారిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయని తెలుస్తోంది. అలానే గుండెపోటు వచ్చే అవకాశం 27 శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా అల్పాహారాన్ని స్కిప్ చేయొద్దు.

అదే విధంగా బ్రేక్ ఫాస్ట్ మానేసే మహిళల్లో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో ఈ విషయం తేలింది. కాబట్టి తప్పకుండా బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోండి.
అలానే చాలా మంది బ్రేక్ ఫాస్ట్ మానరు కానీ ఆలస్యంగా తీసుకుంటారు. ఆలస్యంగా టిఫిన్ తిన్నా కూడా ఇబ్బందులు వస్తాయి. ఆలస్యంగా బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

అదే విధంగా అల్పాహారం తినకపోవడం వల్ల క్యాన్సర్ సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. అదే ఒకవేళ యువత బ్రేక్ ఫాస్ట్ తినకపోతే ఏకాగ్రత బాగా తగ్గిపోతుందట. అదేవిధంగా అల్పాహారం తీసుకోవడం మానేస్తే జుట్టు త్వరగా ఊడిపోతుంది. బట్టతల కూడా వస్తుంది. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల బరువు కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. అయితే చాలా మంది సన్నగా అవ్వాలంటే బ్రేక్ఫాస్ట్ మానేస్తారు కానీ బ్రేక్ఫాస్ట్ తినకపోతే లావు అవుతారు గమనించండి.

Read more RELATED
Recommended to you

Latest news