అజీర్తి తో బాధపడే వాళ్ళు ఇలా చెయ్యండి…!

-

చాలా మంది ఆహారం జీర్ణం కావటం లేదని బాధ పడతారు. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు ఆహారం ఎంతో చక్కగా జీర్ణం కావడంతో పాటు చక్కటి ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. ముందుగా భోజనం చేసేటప్పుడు బాగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆహారం జీర్ణం నోటి నుంచి ప్రారంభం అవుతుంది. కనుక బాగా నమిలి తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. భోజనం చేసిన తర్వాత కొద్దిగా సోంపు నమిలితే మంచిది.

అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత అంటే పడుకునే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని పాల లో ఒక స్పూన్ నెయ్యి కలుపుకుని తాగాలి. ఇలా చేస్తే జీర్ణప్రక్రియ మెరుగు పడుతుంది. చాలా మందికి పాలు రుచి నచ్చదు అలాంటప్పుడు పాల లో బాదం పొడిని కలుపుకుని తాగితే ఎంతో శక్తి లభిస్తుంది మరియు జీర్ణక్రియ కూడా బాగుపడుతుంది. పాలు రాత్రి తాగడంతో పాటు ప్రతి ఉదయం ఒక గ్లాసు పాలు మరియు అరటి పళ్ళు తినడం ఆరోగ్యానికి మంచిది.

ఇలా చేయడం వల్ల ఆహారం జీర్ణం అవుతుంది మరియు ముఖ కాంతి పెరుగుతుంది. కానీ షుగర్ వ్యాధి ఉన్నవారు అరటి పండ్లు తినకూడదు. ఉదయం, రాత్రి భోజనం తర్వాత ఏదో ఒక పండు తినవచ్చు. వీటితో పాటు ప్రతి రోజు ఆరు నుండి ఎనిమిది గ్లాసుల వరకు నీళ్లు, తాజా పండ్లు, కూరగాయలు తినడం ఎంతో అవసరం. పండ్లు, కూరగాయలు లో ఉండే పీచు పదార్థాలు జీర్ణ ప్రక్రియకు ఎంతో అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news