ప్రసవం తర్వాత బరువు పెరిగారా? ఈ పనులు చేసి బరవు తగ్గండి!

-

సన్నగా.. బక్కగా ఉండే చాలామంది మహిళలు పెండ్లి తర్వాత బరువు పెరుగుతారు. కొంతమంది పెండ్లి అయినా బరువు పెరుగరు అలాంటిది ప్రసవం తర్వాత మాత్రం అమాంతం బరువు పెరుగుతారు. దీనికి కారణం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడమే. ప్రసవం తర్వాత ఎలా ఉండాలో తెలుసుకోండి.

చాలామంది మహిళల్లో ప్రసవం తర్వాత శారీరకంగా అనేక మార్పులను సంతరించుకుంటారు. ముఖ్యంగా విపరీతంగా బరువు పెరుగుతారు. ఈ బరువును తగ్గించుకునేందుకు ఆరంభంలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రసవానికి ముందు ఉన్నట్టుగానే ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇందుకు కొన్ని చిట్కాలు, ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.
ప్రసవం తర్వాత బిడ్డకు పాలివ్వాలి కాబట్టి ఆహార నియమ నిబంధనలు మాత్రం వైద్యుని సలహా మేరకు పాటించాల్సి ఉంటుంది. ప్రసవం తర్వాత ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటారు. దీంతో అదనపు క్యాలరీల శక్తి శరీరంలో చేరే అవకాశం ఉందంటున్నారు. ఇది తల్లితోపాటు బిడ్డపై ప్రభావం చూపుతుంది.

కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్యాల్షియం వల్ల తల్లీబిడ్డలకు ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. క్యాలరీలు ఎక్కువగా ఉన్నాయని ఆహారం తీసుకోకూడదనడం లేదు. తీసుకోవాలి. కానీ, దానికి తగినట్లుగా కొన్ని పనులు చేయాలి. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోకూడదు. కొంచెం సేపు అటూఇటూ తిరుగాలి. బిడ్డ పాలు సరైన పద్దతిలో ఇవ్వాలి. పొట్టపై ఎలాంటి ఒత్తిడి పడకూడదు. దీంతోపాటు వీలైనంత యాక్టివ్‌గా అన్ని పనులు చేసేలా హుషారుగా ఉండాలి. అలాగే ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా కనీసం అరగంటపాటు బ్రిస్క్‌వాక్ చేయాలి.

వీటన్నిటికంట ముఖ్యమైనది ఒకటుంది. అదేంటంటే.. ప్రసవం తర్వాత రెండురోజులకి బొడ్డుకు కిందగా ఉన్న కడుపును బట్టతో గట్టిగా కట్టాలి. ఒత్తుకుంటుందని చాలామంది వదలు చేసుకుంటారు. దీంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. గట్టిగా కట్టుకోవడం వల్ల బొజ్జ పెరుగడాన్ని నియంత్రిస్తుంది. అలానే తినే ఆహారంలో వెల్లుల్లి పాయలు ఎక్కువగా ఉండేలా చేసుకోవాలి. ఇది ఆహారానికి ఎంతో మేలు చేస్తుంది. భవిష్యత్తులో కాళ్లు, కీళ్ల నొప్పులు రాకుండా చూస్తుంది. వెల్లుల్లితో పాటు శొంఠి కూడా తినాలి. వాసన వస్తుందని పక్కన పడేస్తే భవిష్యత్తులో నొప్పులకు స్వాగతం పలికినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news