మానసిక ఆరోగ్యం కోసం గర్భిణీలకు చిట్కాలు..!

-

శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా ప్రతి ఒక్కరికి అంతే ముఖ్యం. ముఖ్యంగా గర్భిణీలు కి మానసిక ఆరోగ్యం బాగుండాలి. అయితే గర్భిణీల మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. గర్భిణీలు మానసిక ఆరోగ్యం పై తప్పక దృష్టి పెట్టాలి. అప్పుడే బిడ్డ కూడా మరింత ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది.

 

pregnant women

ఈ మధ్యకాలంలో ఒత్తిడి చాలా మందిలో పెరిగిపోతుంది. దీనితో నెగిటివ్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది. అందుకని మరీ ఎక్కువ శ్రద్ధ గర్భిణీలు పెట్టాలి. ఆనందంగా తల్లి ఉంటే బిడ్డ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది.

ఇలా గర్భిణీలు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి:

మెడిటేషన్:

మెడిటేషన్ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి గర్భిణిలు మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది. డిప్రెషన్, ఒత్తిడి, యాంగ్జయిటి వంటివి కూడా తగ్గుతాయి. ఎంతో కాన్ఫిడెంట్ గా నమ్మకంగా వాళ్ళు ఉండగలరు. అలానే ఆనందంగా కూడా ఉండడానికి అవుతుంది.

మ్యూజిక్:

మ్యూజిక్ కూడా మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మూడ్ బాగుంటుంది. ఒత్తిడి మరియు ఏంగ్జైటీ కూడా తగ్గుతాయి. డిప్రెషన్ సమస్య కూడా తగ్గుతుంది. హార్ట్ రేట్ మరియు బ్లడ్ ప్రెషర్ కూడా సమానంగా ఉంటాయి.

పోషక పదార్థాలు:

సరైన పోషక పదార్థాలు అందడం కూడా చాలా ముఖ్యం. తీసుకునే ఆహారంలో యాంటీఆక్సిడెంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ వంటివి సమృద్ధిగా ఉండాలి. పొటాషియం, విటమిన్ ఇ, విటమిన్ సి సెరటోనిన్ లెవెల్స్ ని పెంచుతాయి. దీనితో ఆనందంగా ప్రశాంతంగా ఉండొచ్చు. కనుక గర్భిణీలు వీటిపై దృష్టి పెట్టి అనుసరిస్తే కచ్చితంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలరు అలానే సమస్యలు కూడా ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news