ఇలా చేస్తే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం సులభంగా కరిగిపోతుంది?

-

చెడు కొవ్వు నేటి కాలంలో అందరిని బాగా వేధిస్తున్న సమస్య. సాధారణంగా మన శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయి. అందులో ఒకటి ఎల్‌డీఎల్‌. దీన్నే చెడు కొవ్వు అంటారు. ఇంకొకటి హెచ్‌డీఎల్. దీన్ని మంచి కొవ్వు అంటారు.మనం ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ ఇంకా మనం తినే ఫుడ్ కారణంగా మన శరీరంలో ఈ కొలెస్ట్రాల్స్ స్థాయిలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. అయితే మన శరీరంలో ఎల్‌డీఎల్ లెవెల్స్ మాత్రం ఖచ్చితంగా తక్కువగా ఉండాలి. అందుకు హెచ్‌డీఎల్ పనిచేస్తుంది.

ఇక హెచ్‌డీఎల్‌ను పెంచుకోవాలంటే ఇప్పుడు చెప్పే టిప్స్ ఖచ్చితంగా పాటించండి.హెచ్‌డీఎల్ లెవెల్స్ పెరగాలంటే ప్రతి రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. కనీసం రోజుకు 30 నిమిషాలు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. వారంలో కనీసం 5 రోజుల పాటు రోజుకు 30 నిమిషాల చొప్పున వ్యాయామం చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 

ఎందుకంటే దీని వల్ల ఎల్‌డీఎల్ స్థాయిలు తగ్గుతాయి. హెచ్‌డీఎల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవాలంటే ఆలివ్ నూనెను వాడడం చాలా మంచిది. ఇది ఎల్‌డీఎల్‌ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఖచ్చితంగా రోజు సరిగ్గా నిద్రపోవాలి. రోజుకు తగినన్ని గంటలపాటు నిద్రించడం వల్ల కూడా ఎల్‌డీఎల్‌ను ఈజీగా తగ్గించుకోవచ్చు. చాలా మంది రోజూ సరిగ్గా నిద్రపోరు. దీని వల్ల ఎల్‌డీఎల్ స్థాయిలు బాగా పెరుగుతాయి. అందుకే నిద్ర పోవడం కూడా చాలా ముఖ్యమే.

ఇక ఫైబర్ ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. దీని వల్ల కూడా ఎల్‌డీఎల్ స్థాయిలు సులభంగా తగ్గుతాయి. ఇలా ఈ న్యాచురల్ టిప్స్ ని పాటించడం వల్ల ఎల్‌డీఎల్ లెవెల్స్ ని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు.కాబట్టి ఖచ్చితంగా ప్రతి రోజు ఈ టిప్స్ పాటించండి. చెడు కొలెస్ట్రాల్ చాలా ఈజీగా కరిగిపోయి ఎల్లప్పుడూ చాలా ఆరోగ్యంగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news